- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాక్సాఫీసు వద్ద ‘కూలీ’ సంచలనం.. ఊహించని రేంజ్‌లో కలెక్షన్స్.. ఎన్ని కోట్లు రాబట్టిందంటే?
సూపర్ రజినీకాంత్(Rajinikanth) 2023లో ‘జైలర్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.

దిశ, సినిమా: సూపర్ రజినీకాంత్(Rajinikanth) 2023లో ‘జైలర్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత చేసిన లాల్ సలామ్, వెట్టైయాన్ బాక్సాఫీసు వద్ద మెప్పించలేకపోయాయి. అయినప్పటికీ సూపర్ స్టార్ హిట్ ఫ్లాప్‌తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ కుర్ర హీరోలతో పోటీపడుతున్నారు. ఇక ఇటీవల ఆయన ‘కూలీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య వచ్చిన ‘కూలీ’ థియేటర్స్‌లో మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయినప్పటికీ భారీ కలెక్షన్లు రాబడుతూ బాక్సాఫీసును షేక్ చేస్తోంది. తాజాగా, ‘కూలీ’ (coolie)ఊహించని విధంగా అత్యధిక కలెక్షన్లు రాబట్టి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ సినిమా భారతదేశంలో ₹223.24 కోట్లు వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసింది.
1వ రోజు : ₹65 కోట్లు
2వ రోజు ₹54.75 కోట్లు
3వ రోజు : ₹39.5
4వ రోజు : ₹35.25
5వ రోజు : ₹12
6వ రోజు : ₹9.5 కోట్లు
7వ రోజు : ₹6.59 కోట్లు
8వ రోజు : ₹0.19 కోట్లు
మొత్తం 223.24 కోట్లు రాబట్టినట్లు తెలుసుకున్న సూపర్ స్టార్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా, ఈ సినిమాలో అక్కినేని నాగార్జున విలన్‌గా నటించగా.. ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, శృతి హాసన్ కీలక పాత్రలో కనిపించారు. అంతేకాకుండా టాలీవుడ్ స్టార్ బ్యూటీ పూజా హెగ్డే సూపర్ స్టార్ సరసన ఐటమ్ సాంగ్‌లో స్టెప్పులేసింది. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించిన ఈ సినిమా కలెక్షన్స్‌తో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేలా కనిపిస్తోంది.






