Prabhas ప్రతిష్టాత్మక మూవీలో వివాదాస్పద స్టార్ డైరెక్టర్ RGV

by Disha Web Desk 9 |
Prabhas ప్రతిష్టాత్మక మూవీలో వివాదాస్పద స్టార్ డైరెక్టర్ RGV
X

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కల్కి 2898ఏడీ’. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై ఈ సినిమాను అశ్వినీదత్ నిర్మిస్తున్నాడు. దీపికా కథానాయికగా నటించగా.. అమితాబ్ బచ్చన్, దిశా పటానీ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. కోలీవుడ్ హీరో కమల్ హాసన్ విలన్‌గా నటించనున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్‌తో రెబల్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెంచేసుకున్నారు. ప్రస్తుతం ఈ మూవీ గురించి ఇండస్ట్రీని షేక్ చేస్తోన్న ఓ న్యూస్ వైరల్ అవుతోంది. తరచూ కాంట్రావర్సీలు చేసే ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇందులో ఒక క్యామియోలో నటిస్తున్నాడట.

అది కూడా అదిరిపోయే కాంబినేషన్‌లో. నాగ్ ఎప్పటి నుంచో ఇలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే మరో స్టార్ ఎవరని అనుకుంటున్నారా? టాలీవుడ్ దర్శకధీరుడు రాజమమౌళి. వీరిద్దరి మధ్య జరిగే సీన్ ఉంటుదని భారీగా టాక్ వినిపిస్తుంది. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ.. ఒకవేళ వాస్తవమైతే ఇండస్ట్రీని షేక్ చేయడం ఖాయమని అంటున్నారు జనాలు. ఇప్పటి వరకు ఏ మూవీలో క్యామియోలో కనిపించని వర్మ ఫస్ట్ టైం ప్రభాస్‌ చిత్రంలో కనిపించడం అంటే సినిమా వేరే లెవల్‌లో ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ వార్త లీక్ అవ్వాగానే కల్కిపై మరిన్ని అంచనాలు పెంచేసుకున్నారు.

Read More: Chiranjeevi కంటే ముందే Surekha ఆ స్టార్ హీరోను పెళ్లి చేసుకోవానుకుంది.. కానీ



Next Story

Most Viewed