బిగ్‌బాస్-9: నామినేషన్స్‌లో అసలు రంగు బయటపెట్టిన కంటెస్టెంట్స్.. కొట్టుకోబోయిన ఆ ఇద్దరు?

by Mallepaka Hamsa |   (  Updated:2025-09-18 14:41:29  IST  )

బిగ్‌బాస్-9 రెండో వారం కొనసాగుతోంది. శ్రేష్టి వర్మ ఎలిమినేట్ కాగా.. ఇంకా 14 మంది కంటెస్టెంట్స్ హౌస్‌లో పోరాటానికి సిద్ధంగా ఉన్నారు.

బిగ్‌బాస్-9: నామినేషన్స్‌లో అసలు రంగు బయటపెట్టిన కంటెస్టెంట్స్.. కొట్టుకోబోయిన ఆ ఇద్దరు?
X

దిశ, సినిమా: బిగ్‌బాస్-9 రెండో వారం కొనసాగుతోంది. శ్రేష్టి వర్మ ఎలిమినేట్ కాగా.. ఇంకా 14 మంది కంటెస్టెంట్స్ హౌస్‌లో పోరాటానికి సిద్ధంగా ఉన్నారు. మొదటి వారం అంతా కాస్త సైలెంట్‌గా ఉన్న వారంతా.. రెండో నామినేషన్స్‌లో ఊహించని విషయాలకు నామినేట్ చేస్తూ వాదనకు దిగారు. సెలబ్రిటీలు, కామనర్స్ కలిసి రెడ్ కలర్ పూసుకుంటూ నామినేట్ చేసుకున్నారు. ఇక ఇందులో అందరూ కలిసి మాస్క్ మ్యాన్ హరీష్‌ను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. సోమవారం దీక్ష చేసి అందరికీ చిరాకు తెప్పించిన ఆయన నామినేషన్స్‌లో రెచ్చిపోయాడు. ఇక సోమవారం జరిగిన ఎపిసోడ్‌లో రామ్ రాథోడ్, ప్రియా, తనూజ, రితూ చౌదరి హరీష్‌ను నామినేట్ చేయగా.. తన మాటలతో రీతూని ఏడిపించేశాడు. ఆ తర్వాత సింపతీ కార్డ్, ఉమెన్ కార్డు ప్లే చేయొద్దని వార్నింగ్ కూడా కౌంటర్ వేశాడు.

ఆ తర్వాత ఇమాన్యుయేల్ కూడా హరీష్‌ను నామినేట్ చేస్తాడు. తనను రెడ్ ఫ్లవర్ అన్నాడని అనడంతో నేను ఎక్కడా అనలేదని హరీష్ వాదిస్తాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగి కొట్టుకునేందుకు మీదకు.. మీదకు వెళ్తారు. ఇక వీరిద్దరి అరుపులు చూసిన మిగతా కంటెస్టెంట్స్ సైతం భయపడిపోతారు. చివరగా.. ఇమాన్యుయేల్ సూపర్ సూపర్ అనడంతో హరీష్ దూరం వెళ్తాడు. ఇక కెప్టెన్ సంజన విషయానికొస్తే.. ఆమె నటుడు సుమన్ శెట్టిని నామినేట్ చేయగా.. అతను కౌంటర్స్ వేస్తూ.. కామెడీ చేస్తాడు. అయినప్పటికీ సంజన ముఖానికి కలర్ రాసి వెళ్తుంది. మొత్తానికి నాగార్జున చెప్పినట్లు సుమన్ శెట్టి తన ఆటను నామినేషన్స్‌తో మొదలెట్టాడు. ఈ వారం నామినేషన్స్ ప్రేక్షకుల్లో చెమటలు పట్టిస్తున్నాయి.

Next Story