బోల్డ్ సీన్స్‌.. 'కమిట్‌మెంట్'తో రెచ్చిపోయిన హాట్ బ్యూటీ

by Disha Web Desk 7 |
బోల్డ్ సీన్స్‌.. కమిట్‌మెంట్తో రెచ్చిపోయిన హాట్ బ్యూటీ
X

దిశ, సినిమా : ఈ నెల 19న రిలీజ్ కానున్న 'కమిట్‌మెంట్' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. నాలుగు కథలతో వస్తున్న ఈ ఇంట్రెస్టింగ్ మూవీని రచన మీడియా వర్క్స్ సమర్పణలో ఎఫ్3 ప్రొడక్షన్స్, ఫుట్ లూస్ ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మిస్తుండగా.. లక్ష్మీ కాంత్ చెన్న దర్శకత్వం వహిస్తున్నారు. తేజస్వి మదివాడ, అన్వేషి జైన్, అమిత్ తివారి తదితరులు నటించిన సినిమా పోస్టర్స్ చూసి చాలా మంది బోల్డ్ మూవీ అనుకుంటున్నారని.. కానీ ఇది ఫ్యామిలీ, ఫ్రెండ్స్, సొసైటీకి సంబంధించిన చిత్రమని తెలిపింది మూవీ యూనిట్. ప్రస్తుతం ఆడవాళ్లు ఆఫీస్ ఎన్విరాన్మెంట్, సొసైటీలో ఎదుర్కొన్న సమస్యల గురించి ఇందులో చూపించామన్న నిర్మాతలు బల్ దేవ్ సింగ్, నీలిమ.. కచ్చితంగా సమాజానికి మంచి సందేశమిచ్చే చిత్రంగా విమర్శల ప్రశంసలు అందుకుంటుందని ఆకాంక్షించారు.

Next Story

Most Viewed