నెల రోజులకే ఓటీటీలోకి రాబోతున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

by Mallepaka Hamsa |

మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్(Fahad Fazil) ‘పుష్ప’ సినిమాలో విలన్‌గా నటించి ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నాడు.

నెల రోజులకే ఓటీటీలోకి రాబోతున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
X

దిశ, సినిమా: మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్(Fahad Fazil) ‘పుష్ప’ సినిమాలో విలన్‌గా నటించి ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నాడు. అలాగే తమిళ, మలయాళ, తెలుగు భాషల్లో పలు చిత్రాల్లో నటించి మెప్పించాడు. ఇటీవల ఫహాద్ ‘మారీశన్’ (Maareesan)సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వడివేలు ప్రధాన పాత్రలో కనిపించారు. కామెడీ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ చిత్రానికి సుదీశ్ శంకర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో వివేక్ ప్రసన్న, సితార, లివింగ్‌స్టన్, తీనప్పన్, రేణుక, కోవై సరళ(Kovai Sarala), శరవణన్ సుబ్బయ్య కీలక పాత్రలో కనిపించారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ఈ చిత్రం జులై 25న థియేటర్స్‌లో విడుదలై ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసింది.

తాజాగా, ‘మారీశన్’ డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయినట్లు ప్రముఖ సంస్థ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ సినిమా హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోగా.. ఆగస్టు 22నుంచి తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అందుబాటులోకి రాబోతున్నట్లు వెల్లడించారు. ‘‘అబ్బాయిలు లోపలికి రండి, మేము తిరువణ్ణామలై కి వెళ్తున్నాము’’ అనే క్యాప్షన్ జత చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండగా.. అది చూసిన సినీ ప్రియులు వెయిట్ చేయలేకపోతున్నామని ఫైర్ ఎమోజీలు షేర్ చేస్తున్నారు.

Next Story