కంటతడి పెట్టిస్తున్న కలర్స్ స్వాతి.. భర్త జ్ఞాపకాలను తలుచుకుంటూ..

by Kodari Anjali |   (  Updated:2023-10-14 15:01:51  IST  )

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన ‘సోల్ ఆఫ్ సత్య’ అనే షార్ట్ ఫిల్మ్ నుంచి తాజాగా ఓ సాంగ్‌ను రిలీజ్ చేశారు.

కంటతడి పెట్టిస్తున్న కలర్స్ స్వాతి.. భర్త జ్ఞాపకాలను తలుచుకుంటూ..
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన ‘సత్య’ సినిమా నుంచి తాజాగా ఓ సాంగ్‌ను రిలీజ్ చేశారు. దీనికి నవీన్ విజయ్ కృష్ణ దర్శకత్వం వహించారు. సైనికుల భార్యల త్యాగాలను, వారి మనో వేదనను తెలియజేసేలా తెరకెక్కించారు. ఇందులో సాయిధరమ్ తేజ్ (సూర్య) భార్యగా కలర్ స్వాతి ‘సత్య’ అనే పాత్రలో నటించింది. అయితే నేడు (ఆగస్టు 15) స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ ఫిల్మ్ నుంచి ‘‘ సోల్ ఆఫ్ సత్య’ సాంగ్ విడుదల చేశారు. ఈ పాట హృదయాలను హత్తుకునేలా.. అత్యంత భావోద్వేగ భరితంగా ఉండటం విశేషం. సైనికుని భార్య మనో వేదనకు అద్దం పట్టేలా సాంగ్ ఉండటంతో ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ 6.16 నిమిషాల వీడియో నెటిజన్లను కంటతడి పెట్టిస్తోంది.


Next Story