సినిమా ఏకం చేస్తుంది.. రాజకీయాలు విడగొడతాయి.. ఎన్టీఆర్‌ పేరును ప్రస్తావిస్తూ సింగర్ ట్వీట్

by Mallepaka Hamsa |

ఇటీవల అనంతపురం ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్(Venkateswara Prasad) వివాదాస్పద కామెంట్స్ చేసినట్లుగా ఓ ఆడియో నెట్టింట వైరల్ అయిన విషయం తెలిసిందే.

సినిమా ఏకం చేస్తుంది.. రాజకీయాలు విడగొడతాయి.. ఎన్టీఆర్‌ పేరును ప్రస్తావిస్తూ సింగర్ ట్వీట్
X

దిశ, సినిమా: ఇటీవల అనంతపురం ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్(Venkateswara Prasad) వివాదాస్పద కామెంట్స్ చేసినట్లుగా ఓ ఆడియో నెట్టింట వైరల్ అయిన విషయం తెలిసిందే. గుత్తా ధనుంజయ నాయుడు, వెంకటేశ్వర ప్రసాద్ ‘వార్-2’(war-2) బెనిఫిట్ షోల గురించి చర్చించుకున్న సమయంలో ఎమ్మెల్యే పలు వ్యాఖ్యలు చేసినట్లుగా అందులో ఉంది. ఇక ఈ కామెంట్స్ గురించి తెలుసుకున్న నెటిజన్లు, తారక్ అభిమానులు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎమ్మెల్యే ఆ ఆడియోలో ఉన్నది తన వాయిస్ కాదని వివరణ ఇచ్చాడు. అయినప్పటికీ ఈ వివాదానికి చెక్ పడలేదు. ఎన్టీఆర్ (ntr)అభిమానులు అనంపురంలో నిరసన కూడా చేశారు. ఈ విషయంపై చంద్రబాబు కూడా స్పందించారు. ఇక ఈ విషయంపై కొందరు సోషల్ మీడియా ద్వారా కూడా స్పందిస్తున్నారు.

కానీ ఇప్పటి వరకు ఎన్టీఆర్‌కు మద్దతుగా సినీ ఇండస్ట్రీలోని సెలబ్రిటీలు ఏ ఒక్కరు పోస్టులు పెట్టలేదు. తాజాగా, టాలీవుడ్ సింగర్ అనుదీప్ దేవ్ ట్విట్టర్ ద్వారా ఆసక్తికర పోస్ట్ పెట్టాడు. ‘‘తారక్ సార్‌తో సంఘీభావంగా నేను నిలబడుతున్నాను. సినిమా మనలని ఏకం చేస్తే.. రాజకీయాలు విడగొడతాయి. రెండింటినీ వేరుగా ఉంచుదాం. ఈ రోజు ఎన్టీఆర్‌కు ఎదురైన సందర్భం ముందు ముందు ఏ స్టార్‌కు అయినా ఎదురుకావచ్చు. కాబట్టి మొత్తం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కలిసికట్టుగా నిలబడి మన ప్రియమైన ఎన్టీఆర్‌కు మద్దతు ఇవ్వాలని అందరినీ అభ్యర్థిస్తున్నాను’’ అని రాసుకొచ్చాడు. అంతేకాకుండా స్టాంగ్‌విత్ ఎన్టీఆర్, టీఎఫ్‌ఐయునైటెడ్ అనే హ్యాష్ ట్యాగ్స్ పెట్టాడు. ఇక ఈ పోస్ట్ చూసిన కొందరు థాంక్స్ చెబుతుంటే.. మరికొందరు మాత్రం ఇవన్నీ నీకు ఎందుకు మ్యూజిక్ కంపోజ్ చేసి మంచి పాటలు పాడు అని కామెంట్లు పెడుతున్నారు.

link

Next Story