- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ramoji Rao : ‘తెలుగు జాతి గొప్ప వ్యక్తిని.. మహాశక్తిని కోల్పోయింది’
రామోజీ గ్రూప్ సంస్థల అధినేత, మీడియా దిగ్గజం రామోజీరావు మృతిపట్ల మెగాస్టార్ చిరంజీవి సంతాపం తెలిపారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఆయన

దిశ, వెబ్‌డెస్క్: రామోజీ గ్రూప్ సంస్థల అధినేత, మీడియా దిగ్గజం రామోజీరావు మృతిపట్ల మెగాస్టార్ చిరంజీవి సంతాపం తెలిపారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఆయన పార్థివదేహానికి మెగాస్టార్ నివాళులర్పించారు. అనంతరం చిరు మీడియాతో మాట్లాడుతూ.. రామోజీరావు మరణం తెలుగు సమాజానికి తీరని లోటని అన్నారు. ఆయన మరణంతో తెలగుజాతి గొప్ప వ్యక్తిని, మహాశక్తిని కోల్పోయిందని ఎమోషనల్ కామెంట్స్ చేశారు. రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని అన్నారు. ఈ దుఖ సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, సిబ్బందికి నా ప్రగాడ సానుభూతి తెలుపుతున్నానన్నారు.
తన కెరీర్‌లో అనేక సార్లు ఆయన నుండి సలహాలు తీసుకున్నానని గుర్తు చేసుకున్నారు. ఆయన తన ప్రతి ఒక్క ఆలోచనను డెయిరీలో రాసుకునే వారని అన్నారు. సమాజానికి ఏం చేయాలని నిరంతరం తపన పడేవారని గుర్తు చేశారు. కాగా, గత కొంతకాలంగా అనారోగ్యం, వృద్ధాప్య సమస్యలతో బాధపడుతోన్న రామోజీ రావు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజూమున తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే.
- Tags
- ramoji rao






