Megastar Chiranjeevi : సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న చిరు?

by Phanindra |   (  Updated:2023-07-04 09:21:22  IST  )

ఈ మూవీ తొందరగా ఫినిష్ చేసుకుని సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు.

Megastar Chiranjeevi : సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న చిరు?
X

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘భోళ శంకర్’ ఆగస్టు 11న విడుదలకు సిద్ధం అవుతోంది. ఇక చిరంజీవి తన తదుపరి సినిమా కల్యాణ్ కృష్ణతో చేయనున్నారు. ఈ మూవీ తొందరగా ఫినిష్ చేసుకుని సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు. కానీ ఈ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లేందుకు ఇంకాస్తా సమయం పట్టేలా ఉందట. దీంతో ఈ సినిమా వేసవిలోనే విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక చిరు, కృష్ణల మూవీతో పాటు ‘బింబిసార’ దర్శకుడు మల్లిడి వశిష్టతో కూడా మరో ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీని గురించి అధికారికంగా ప్రకటన రావాల్సివుంది. ఇక అది కూడా కన్ఫర్మ్ అయితే ఈ రెండు సినిమాలకు ఏకకాలంలో వర్క్ చేయనున్నారు చిరు.

Read more : త్రివిక్రమ్‌పై మహేష్ ఫ్యాన్స్ ఫైర్.. తమ హీరోను పట్టించుకోవట్లేదంటూ

Next Story