Chiranjeevi ఫ్యాన్స్ vs Pawan Kalyan ఫ్యాన్స్.. NagaBabu ఎంట్రీతో ఆ ట్వీట్ డిలీట్!

by Kodari Anjali |   (  Updated:2023-07-20 11:19:42  IST  )

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

Chiranjeevi ఫ్యాన్స్ vs Pawan Kalyan ఫ్యాన్స్.. NagaBabu ఎంట్రీతో ఆ ట్వీట్ డిలీట్!
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. తాజాగా జనసేన పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న రాయపాటి అరుణ చిరంజీవిని ఉద్దేశిస్తూ పరుషంగా మాట్లాడారు. అసలు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం పెద్ద తప్పు. చిరంజీవి నిర్ణయం పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితానికి సంకటంగా మారింది. ఆయన ఫెయిల్యూర్ పాత్ వేసిపోయారు. చిరంజీవి వల్ల రాష్ట్ర ప్రజలు లాస్ అయ్యారు. ఆయనకేమీ నష్టం లేదు. మళ్లీ సినిమాలు చేస్తూ హ్యాపీగా ఉన్నారంటూ ఆమె చెప్పుకొచ్చారు. దీంతో చిరంజీవి అభిమానులు రాయపాటి అరుణ మెగాస్టార్‌కు క్షమాపణలు చెప్పాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇక, పవన్ ఫ్యాన్స్ ఆమెకు అండగా ఉండి కౌంటర్లు స్టార్ట్ చేశారు. కాగా, నెట్టింట చిరంజీవి ఫ్యాన్స్ వర్సస్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అన్నంతలా రచ్చ జరుగుతోంది. ఈ గొడవ ఇలా ఉండగా.. రామ్ చరణ్ అభిమాని.. ‘పీఆర్వో అయిన శివ చెర్రీ దూరాడు. చిరంజీవి యువత పేరున ఒక లెటర్ రీలీజ్ చేశారు. రాయపాటి అరుణ చిరంజీవికి క్షమాపణలు చెప్పాలని ఆ లేఖలో ఉంది. ఏకంగా మెగా ఫ్యామిలీ మెంబర్స్ అడిగినా నేను క్షమాపణ చెప్పనని అరుణ ఓ వీడియో పోస్ట్ చేశారు. దీంతో నాగబాబు ఈ వివాదాన్ని ఆపే ప్రయత్నం చేస్తూ.. తను జనసేనకు నిస్వార్థంగా సేవలు అందించారు. ‘ఆమె నోరు జారి ఒక మాట అన్నారు. అంతమాత్రాన తనను నిందించడం కరెక్ట్ కాదంటూ ట్వీట్ చేశారు. ఇక శివ చెర్రీ చిరంజీవి రాష్ట్ర పేరున ట్వీట్‌ను డిలీట్ చేశారు. ఈ గొడవకు ముఖ్యకారణం శివ చెర్రీనే కారణమని పవన్ అభిమానులు మండిపడుతున్నారు.

Also Read: మొదటిసారి ఆ పాత్రలో నటించనున్న Megastar Chiranjeevi!

Click Here For Hot Latest Photo Gallery

Click Here For more Movie News & Gossips

Next Story