Chiranjeevi కి ఎవరి సపోర్టూ అవసరం లేదు : Tammareddy

by Disha Web Desk 10 |
Chiranjeevi కి ఎవరి సపోర్టూ అవసరం లేదు : Tammareddy
X

దిశ, సినిమా : యంగ్ హీరోస్‌కు పోటీగా ఇప్పటకీ వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు మెగా స్టార్ చిరంజీవి . అయితే రీసెంట్‌గా 'గాడ్ ఫాధర్ ' మూవీలో చిరు‌తో బాలీవుడ్ బాద్‌షా సల్మాన్ ఖాన్ ముఖ్యపాత్ర పోషించిన విషయం తెలిసిందే. దీంతో మెగాస్టార్‌కి ఫాలోయింగ్ తగ్గిందని, అందుకే సపోర్టింగ్ కోసం, మూవీ హిట్ కోసం ఇలా..టాప్ హీరోల‌ను తన సినిమాలోకి తీసుకొస్తున్నాడని పలువురు వ్యాఖ్యానించారు. అలాగే ఇప్పుడు 'వాల్తేర్ వీరయ్య' మూవీ‌లో మాస్ రాజా రవితేజ కూడా నటిస్తుండటంతో చిరుకి కచ్చితంగా ఒక తోక అవసరం. లేదంటే..అతని సినిమాలు హిట్ అవ్వడం కష్టం అని మళ్లీ కామెంట్లు స్టార్ట్ చేశారు కొందరు. దీంతో చిర్రెత్తిపోయిన తమ్మారెడ్డి ఈ విషయం‌పై స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. '' ఎవరు కాదన్నా..ఎట్ ప్రజెంట్ ఇండస్ట్రీకి పెద్ద మనిషి మెగా స్టార్ చిరంజీవే! టాలీవుడ్‌ని వెన్నంటి నడిపించేదీ ఆయనే! యంగ్‌ ఫిల్మ్ ఫెటర్నిటీకి మార్గ నిర్దేశం చేసేది కూడా చిరంజీవే! ఆయనకు తోకలు..ఆయన్ని ఎత్తడానికి ఎలాంటి సపోర్టూ అవసరం లేదు. ఎస్ ! రీసెంట్‌ డేస్‌లో చిరు మార్కెట్ తగ్గిందని.. సినిమాలో మరో హీరో లేనిదే తన మార్కెట్ పెరగడం లేదని కారు కూతలు కూస్తున్నారు..చిరు మార్కెట్ ఎక్కడికీ పోలేదు..ఆయన మార్కెట్ ఆయనదే..ఎవరు అవునన్నా..కాదన్నా..ఆయన నెంబర్ 1'' అని తమ్మారెడ్డి గట్టిగా స్టేట్ మెంట్ ఇచ్చారు.

Also Read...

అన్ స్టాపబుల్ షో అనధికారిక ప్రసారాలు ఆపివేయండి.. ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు

Next Story

Most Viewed