- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Chinmayi: చీర కట్టుకున్న అమ్మాయిలపై జరుగుతున్నదేంటి?..మరోసారి హాట్ టాపిక్ అయిన చిన్మయి పోస్ట్
‘దండోరా’ సినిమా ఈవెంట్‌లో నటుడు శివాజీ (Shivaji)చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమను గట్టిగా కుదిపేస్తున్నాయి.

దిశ, సినిమా: ‘దండోరా’ సినిమా ఈవెంట్‌లో నటుడు శివాజీ (Shivaji)చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమను గట్టిగా కుదిపేస్తున్నాయి. హీరోయిన్ల దుస్తులు, వారి వ్యక్తిగత వస్తువులపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా మారడంతో పెద్ద వివాదానికి దారితీశాయి. ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, మహిళా సంఘాలు, నెటిజన్లు, సినీ ప్రముఖులు తీవ్రంగా స్పందిస్తున్నారు.ఈ వ్యవహారంపై ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు తమ అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేశారు. ముఖ్యంగా గాయని చిన్మయి, యాంకర్ అనసూయ శివాజీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ వరుసగా పోస్టులు పెడుతున్నారు.
మహిళలను అవమానించే విధంగా మాట్లాడటం ఎంత ప్రమాదకరమో, ఇలాంటి వ్యాఖ్యలను సమర్థించడం సమాజాన్ని తప్పుదోవ పట్టించడమేనని వారు స్పష్టంగా పేర్కొన్నారు. శివాజీ మాటలు కేవలం వ్యక్తిగత అభిప్రాయాలు కావని, అవి మహిళల గౌరవాన్ని దెబ్బతీసే స్థాయిలో ఉన్నాయని విమర్శించారు. ఇక మరోవైపు కొందరు మాత్రం శివాజీకి మద్దతుగా నిలుస్తూ, ఆయన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని, సందర్భం వేరని వాదిస్తున్నారు. సోషల్ మీడియాలో రెండు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం కొనసాగుతోంది. ఒక్కొక్కరు ఒక్కోలా స్పందించడంతో ఈ వివాదం రోజురోజుకూ మరింత ముదిరిపోతోంది.
ఈ వివాదం మహిళా కమిషన్ వరకు వెళ్లడంతో పాటు, పోలీస్ కేసుల దశకు కూడా చేరింది. శివాజీ వ్యాఖ్యలపై ఫిర్యాదులు నమోదవ్వడంతో చట్టపరమైన చర్యలు ఏ దిశగా వెళ్లనున్నాయనే ఆసక్తి పెరిగింది. ఇదిలా ఉండగా, ఇప్పటికే పలుమార్లు స్పందించిన చిన్మయి(Chinmayi) తాజాగా, మరో సంచలన పోస్ట్ పెట్టడం హాట్ టాపిక్‌గా మారింది. ఆమె పోస్టులో మహిళలపై జరిగే మాటల దాడి, మానసిక హింసపై ఘాటుగా ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. చీరకట్టుకున్న అమ్మాయి వీడియో షేర్ చేస్తూ..మహిళలు పూర్తిగా కప్పుకున్న చీర వేసుకుంటే గౌరవం వస్తుందని మనకు చెప్పారు. కానీవాస్తవంలో పరిస్థితి ఎలా ఉందో చూడండి’’ అనే క్యాప్షన్ జత చేసింది.






