- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న చిన్మయి బోల్డ్ ఫొటోలు.. డబ్బులు తీసుకుని ఇలా చేస్తున్నారంటూ ఫైర్
సింగర్ చిన్మయి శ్రీపాద(Chinmayi Sripada) గత కొద్ది రోజులుగా ట్రోలింగ్‌కు గురవుతోంది.

దిశ, సినిమా: సింగర్ చిన్మయి శ్రీపాద(Chinmayi Sripada) గత కొద్ది రోజులుగా ట్రోలింగ్‌కు గురవుతోంది. ఇటీవల ఆమె భర్త రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran)తాళి వేసుకోవడం ఆమె ఇష్టం అనడంతో సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ఇక అప్పటినుంచి ఆమెపై జనాలు తీవ్రంగా మండిపడుతున్నారు. పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నాక తాళి వేసుకోకపోవడం ఏంటని తిడుతున్నారు. ఈ నేపథ్యంలో.. చిన్మయి స్పందించి క్లారిటీ ఇచ్చినప్పటికీ ఈ ట్రోల్స్‌కు చెక్ పడటం లేదు. అలాగే ఇటీవల ఆమెను ఓ నెటిజన్ లం** ముండా అనడంతో ఈ వివాదం కాస్త హాట్ టాపిక్‌గ మారింది. అలా తనను ఇబ్బంది పెట్టినప్పటికీ చిన్మయి మాత్రం ఏ మాత్రం భయపడకుండా.. తనపై ట్రోల్ చేస్తున్న వారికి స్ట్రాంగ్‌గానే కౌంటర్లు వేస్తోంది.
తాజాగా, ఓ బోల్డ్ ఫొటో వైరల్ అవుతుండగా.. చిన్మయి ఘాటుగా స్పందించింది. ‘‘ఈరోజు నాకు ఒక పేజీ నుండి మార్ఫింగ్ చేసిన ఫోటో వచ్చింది. నేను దాన్ని పోలీసులకు ట్యాగ్ చేశాను. చట్టపరమైన చర్యలు తీసుకుంటారో లేదో అన్నది ఇక్కడ విషయం కాదు. కానీ గత 8-10 వారాలుగా మా కుటుంబాన్ని వేధించడానికి డబ్బు తీసుకుని ఈ పని చేస్తున్న 'ల** ముండా' అని తిట్టే వ్యక్తుల నుండి అమ్మాయిలను, వారి కుటుంబాలను కాపాడటానికి నేను ఈ వీడియో చేశాను’’ అని రాసుకొచ్చింది. చిన్మయి ఇటీవల తనపై, తన కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో వస్తున్న అసభ్యకరమైన కామెంట్లపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్‌కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
అయినప్పటికీ కొందరి ప్రవర్తన మారడం లేదు. తనను ఇబ్బంది పెడుతున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసినట్లు తెలుపుతూ చిన్మయి ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే పుట్టిన పిల్లలు చచ్చిపోవాలని కోరుకునే ఇటువంటి అబ్బాయిలకి అమ్మాయిలని ఇచ్చి పెళ్లి చేయాలా? అని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో మార్ఫింగ్ ఫోటోలు వస్తే అమ్మాయిలు భయపడవద్దని, కుటుంబ సభ్యులకు తెలియజేసి పోలీసులకు కంప్లైంట్ చేయాలని చిన్మయి సూచించింది.






