- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆయనతో పని చేయడంతో నా చిన్ననాటి కల నెరవేరింది: రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), అస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్(AR Rahman) కాన్సర్ట్‌లో సందడి చేశారు.

దిశ, సినిమా: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), అస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్(AR Rahman) కాన్సర్ట్‌లో సందడి చేశారు. రెహమాన్ కాన్సర్ట్ రామోజీ ఫిల్మ్ సిటీలో అట్టహాసంగా జరిగింది. అతిథులుగా హాజరైన రామ్‌చరణ్, జాన్వీ కపూర్, బుచ్చిబాబు సానా ఆడియన్స్‌లో మరింత జోష్ నింపారు. ‘పెద్ది’ (peddi)సినిమాలోని చికిరి చికిరి లైవ్ పెర్ఫామెన్స్‌ని ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ ఈవెంట్‌కు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ.. రెహమాన్ గారి సంగీతంలో భాగమవ్వాలనేది నా చైల్డ్‌హుడ్ డ్రీం. అది నా ప్రాజెక్ట్ ‘పెద్ది’ తో నెరవేరినందుకు చాలా ఆనందంగా ఉంది.
కాగా.. ఈ మూవీ చికిరి పాట ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. మొత్తం 13 దేశాల్లో టాప్ ట్రెండింగ్‌లో ఉంది. పాట విడుదలైనప్పటి నుండి అన్ని ప్లాట్‌ఫామ్‌లలో కొత్త రికార్డ్స్ నెలకొల్పుతోంది. రూరల్ బీట్స్, ఎనర్జిటిక్ మ్యూజిక్, అద్భుతమైన విజువల్స్, రామ్ చరణ్ మాస్ ఇమేజ్ తో “చికిరి చికిరి” పాట అదిరిపోయింది. మొదటి 24 గంటల్లోనే “చికిరి చికిరి” యూట్యూబ్‌లో సెన్సేషన్‌గా మారింది. దేశవ్యాప్తంగా టాప్ చార్ట్స్‌లో నెంబర్ 1 స్థానం దక్కించుకుంది. నాలుగు భాషల్లో కలిపి 53 మిలియన్ ప్లస్ వ్యూస్ సాధించింది.






