'RIP రూమర్స్'.. 'జనగణమన'పై క్లారిటీ ఇచ్చిన Charmy Kaur

by Hajipasha |   (  Updated:2022-09-08 18:13:52  IST  )

దిశ, సినిమా: 'జనగణమన' సినిమాపై వస్తున్న రూమర్స్‌ను చార్మీ తిప్పికొట్టింది.Latest Telugu News

RIP రూమర్స్.. జనగణమనపై క్లారిటీ ఇచ్చిన Charmy Kaur
X

దిశ, సినిమా: 'జనగణమన' సినిమాపై వస్తున్న రూమర్స్‌ను చార్మీ తిప్పికొట్టింది. పూరీ జగన్నాధ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో వచ్చిన 'లైగర్' అట్టర్ ఫ్లాప్ కావడంతో నిర్మాతగా వ్యవహరించిన చార్మీ.. కొంతకాలం సోషల్ మీడియాకు దూరంగా ఉంటానని చెప్పింది. కానీ, తమ నెక్ట్స్ ప్రాజెక్ట్ 'జనగణమన' చిత్రంపై నెటిజన్లు భారీ ట్రోలింగ్ మొదలుపెట్టడంతో మళ్లీ నెట్టింట దర్శనమిచ్చిన ఆమె..

'గత రెండు రోజులుగా 'జనగణమన'పై వస్తున్న పుకార్లన్నీ ఫేక్!. ఈ సినిమాకోసం భారీ మొత్తం వృథా అయిందని, చిత్రాన్ని పక్కన పెట్టేశారని ఎన్నో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందంతా అబద్ధం. మేకర్స్ ఎవరూ నష్టపోలేదు. పూరీ కనెక్ట్స్ ఎదుగుదల పైనే దృష్టి సారిస్తున్నాం. ప్రస్తుతం విజయ్ దేవరకొండ కూడా 'ఖుషి' షూటింగ్‌పై దృష్టి పెట్టాడు. పూరి 'లైగర్' నష్టాన్ని భర్తీ చేస్తాడు. అతను త్వరలో తిరిగి పుంజుకుంటాడు' అంటూ చెప్పుకొచ్చిన నటి.. 'పుకార్లకు RIP' అంటూ సంతాపం ప్రకటించింది.

Also Read: సమంత రెండో పెళ్లిపై క్లారిటీ..?

Next Story