Ram Charan: 'కభీ ఈద్ కభీ దివాలీ'.. సల్మాన్‌తో రామ్ చరణ్ స్పెషల్ సాంగ్

by Javid Pasha |   (  Updated:2022-06-21 12:26:20  IST  )

Ram Charan Will Act In Cameo Role In Salman Khan's Kabhi Eid Kabhi Diwali| బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న 'కభీ ఈద్ కభీ దివాళి' చిత్రం కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Ram Charan Will Act In Cameo Role In Salman Khans Kabhi Eid Kabhi Diwali
X

దిశ, సినిమా : Ram Charan Will Act In Cameo Role In Salman Khan's Kabhi Eid Kabhi Diwali| బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న 'కభీ ఈద్ కభీ దివాళి' చిత్రం కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఫర్హాద్ సంజీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోనే జరుగుతోంది. ఇదిలా ఉంటే.. ఈ మూవీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ స్పెషల్ సాంగ్ చేయబోతున్నాడనే టాక్ వినిపిస్తోంది. ఈ వార్త అభిమానులకు కిక్ ఇస్తుండగా.. చెర్రీ, సల్మాన్ కలిసి మాస్ సాంగ్‌లో కనిపిస్తే ఆ మజానే వేరంటూ సంబరపడిపోతున్నారు. ఇక వెంకటేష్‌తో పాటు జాస్సీ గిల్, షెహనాజ్ గిల్, పాలక్ తివారీ, రాఘవ్ జుయల్, సిద్ధార్థ్ నిగమ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రాన్ని క్రిస్మస్ స్పెషల్‌గా విడుదల చేయబోతున్నారు మేకర్స్.

Next Story