నువ్వు ఏ పని అయినా చేయించుకో.. సాయంత్రం మాత్రం నాకు వదిలేయ్: సిరిపై చంటి వల్గర్ కామెంట్స్ (వీడియో)

by Disha Web Desk 7 |
నువ్వు ఏ పని అయినా చేయించుకో.. సాయంత్రం మాత్రం నాకు వదిలేయ్: సిరిపై చంటి వల్గర్ కామెంట్స్ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెరపై ప్రసారం అయ్యే షో లలో ‘సుమ అడ్డా’ ఒకటి. ఈ షోకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కింది. ఈ షోలో సుమ ఎంతో మంది సెలబ్రిటీలతో ఓ ఆట ఆడుకుంటుంది. తన కామెడీతో, విచిత్రమైన ప్రశ్నలతో వచ్చిన సెలబ్రిటీలకే కాకుండా చూస్తున్న ప్రేక్షకులకు కూడా మంచి ఎంటర్‌టైన్ మెంట్ ఇస్తుంది. అయితే కొన్ని కొన్ని సార్లు కామెడీగా చేసిన పంచ్‌లు కూడా కాంట్రవర్షకి దారి తీస్తాయి. ఈ క్రమంలో ఈవారం ప్రసారం అయ్యే ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ప్రోమోలో.. ఈ వీక్ షో అడటానికి చలాకీ చంటి, సిరి హన్‌మంత్, ఆర్జే కాజల్, సన్నీ వచ్చినట్లు ప్రోమోలో చూస్తే తెలుస్తోంది. ఎప్పటి లాగే ఫన్నీగా సాగిన ప్రోమో.. ఒక సర్‌ప్రైజింగ్ థీమ్‌తో నెక్ట్ లెవల్‌కి వెళ్లిపోయింది. విక్టరీ వెంకటేష్ సూపర్ హిట్ ఫ్యామిలీ ఫిలిం ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ స్క్రిప్ట్ చేశారు. ఇందులో కాజల్ ‘నేపాల్ నుంచి నాకు ఏం తెచ్చారు’ అని అడిగితే.. ‘నువ్వు ఒక్కదానివే కష్టపడుతున్నావని పనమ్మాయిని తీసుకొచ్చాను. ఏ పనులు కావాలంటే ఆ పనులు చేయించుకో కానీ,, సాయంత్రానికి మాత్రం వదిలేస్తూ ఉండు’ అని సిరిని చూపిస్తూ అంటాడు చంటి. దానికి సుమ ఇచ్చిన రియాక్షన్ అక్కడ డబల్ మీనింగ్ వచ్చేలా అర్థం అయింది. దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


Next Story

Most Viewed