దెయ్యానికి వయసు అవుతుందా? జుట్టు తెల్లబడుతుందా?

by Bhoopathi Nagaiah |   (  Updated:2023-10-10 16:58:42  IST  )

గతంలో రజనీకాంత్ నటించిన ‘చంద్రముఖి’ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలిసిందే.

దెయ్యానికి వయసు అవుతుందా? జుట్టు తెల్లబడుతుందా?
X

దిశ, సినిమా: గతంలో రజనీకాంత్ నటించిన ‘చంద్రముఖి’ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలిసిందే. నయనతార, ప్రభు, జ్యోతిక ప్రధానపాత్రలు పోషించిన ఈ సినిమాను ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేరు. ఇక ఇదే మూవీకి సీక్వెల్‌గా ‘చంద్రముఖి 2’ తెరకెక్కిన విషయం తెలిసిందే. బాలీవుడ్ క్వీన్ కంగనా రానౌత్, లారెన్స్ లీడ్ రోల్స్‌లో వడివేలు, రాధిక, లక్ష్మీ మీనన్, మహిమా నంబియార్ , శృతి డాంగే కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ఇక తాజాగా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.

ఇక ఈ ట్రైలర్‌లో లారెన్స్ టు షేడ్స్‌లో కనిపించాడు. చంద్రముఖి పాత్రలో కంగనా ర‌నౌత్ ఒదిగిపోగా.. పార్ట్ వన్‌లో మాదిరిగానే బ‌స‌వ‌య్యగా మెప్పించిన స్టార్ క‌మెడియ‌న్ వ‌డివేలు.. మళ్లీ ఈ సినిమాలో అదే పాత్రలో కనిపించాడు. 17 ఏళ్ల తర్వాత మళ్లీ రిపీట్ అంటూ చెప్పిన డైలాగ్‌తో ట్రైలర్ స్టార్ట్ కాగా.. నిజమైన చంద్రముఖి వస్తే ఎలా ఉంటుందనేది సినిమా కాన్సెప్ట్ కాగా.. దెయ్యాలకు వయసు అవుతుందా లేదా? ఘోస్ట్‌లపై రీసెర్చ్ డైలాగ్స్ మూవీపై హైప్‌ను క్రియేట్ చేశాయి.

Next Story