నాన్నంటే చంద్రమోహనే..

by Bhoopathi Nagaiah |

హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన చంద్రమోహన్ ఆ తర్వాత కమెడియన్‌గా తన సినీ ప్రస్థానాన్ని కొనసాగించారు.

నాన్నంటే చంద్రమోహనే..
X

దిశ, వెబ్‌డెస్క్ : హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన చంద్రమోహన్ ఆ తర్వాత కమెడియన్‌గా తన సినీ ప్రస్థానాన్ని కొనసాగించారు. ఆ తర్వాత 2000 సంవత్సరం నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారారు. ముఖ్యంగా ఆయన చేసిన తండ్రి పాత్రలు ఎవర్ గ్రీన్‌గా నిలిచాయి. పాత్ర ఏదైనా దానిలో పరకాయ ప్రవేశం చేసి నటించే నైజం చంద్రమోహన్‌ది. తను పండించే కామెడీ నెక్స్ట్ లెవల్లో ఉంటుంది. ఎమోషనల్ పాత్రల్లో కూడా నటించి చంద్రమోహన్ ప్రేక్షకులను ఏడిపించేవారు. ఇక ఆయన తండ్రిగా నటించిన సినిమాలు సూపర్ హిట్‌గా నిలిచాయి. మనసంతా నువ్వే సినిమాల్లో ఆయన పాత్ర పండించిన కామెడీ అంత ఇంత కాదు. ఇక చంద్ర మోహన్ కెరీర్‌లో గొప్పగా చెప్పుకోవాల్సిన సినిమా 7జి బృందావన్ కాలనీ. ఈ సినిమాలో చంద్ర మోహన్ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఒక మధ్యతరగతి తండ్రిగా ఆ సినిమాలో ఆయన చేసిన నటన అద్భుతం.

ఇంట్లో చదువు రాని కొడుకుపై ఆయన తన కోపాన్ని చూపించే సన్నివేశాల్లో ఆయన నిజంగానే జీవించారు. ఈ సినిమాలో చంద్రమోహన్ పాత్రలో అందరూ తమ తండ్రులని చూసుకున్నాంటే అతిశయోక్తి కాదు. ఇదేకాకుండా ‘అతనొక్కడే’ మూవీలో తండ్రి పాత్రకు ఏకంగా అవార్డును కొట్టేశారు చంద్రమోహన్. ఇక రాఖీ సినిమాలో ఒక ఆడపిల్లకి పెళ్లి చేయడానికి తండ్రి పడే తిప్పలు ఈ సినిమాలో చంద్ర మోహన్‌లో చూడొచ్చు. సినిమాలో ద్వారా ఆయన ప్రేక్షకులను ఏడిపించారు. ఈ సినిమాలతో తెలుగులో హీరో తండ్రి పాత్రలు అంటే చంద్రమోహనే గుర్తొచ్చే వారంటే ఆశ్చర్యం వేయకమానదు. ఆయన చాలా సినిమాల్లో కామెడీ తండ్రిగా నటించి బాగా నవ్వించారు. అలా వచ్చిన కందిరీగ , లౌక్యం, ఆక్సిజన్ సినిమాలు సూపర్ హిట్స్‌గా నిలిచాయి.

Next Story