Unstoppable With NBK: బాలయ్యతో సందడి చేయనున్న చంద్రబాబు

by Dishanational2 |
Unstoppable With NBK: బాలయ్యతో సందడి చేయనున్న చంద్రబాబు
X

దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ డైలాగ్ కింగ్ బాలయ్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన డైలాగ్స్‌కు అందరూ ఫిదా అవుతుంటారు. ఆయన ఏది చేసినా అది సెన్సేషన్ అవుతూ ఉంటుంది. తాను ఏ సినిమా చేసినా అక్కడన్న వారితో ఈజీగా కలసిపోతారు. అంతే కాకుండా సెట్‌లో అందరిని నవ్వించడంలోనూ, ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇవ్వడంలో బాలయ్య ముందు ఉంటారంట.

ఇక ఈయన సినిమాలతోనే కాకుండా హోస్ట్‌గా కూడా అదరకొడుతున్నాడు. అన్ స్టాబుల్ విత్ ఎన్‌బీకే మొదటి సీజన్ దిగ్వజయంగా పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. అంతే కాకుండా నెంబర్ వన్ టాక్ షోగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈ షోతో బాలయ్యకు ఫ్యాన్స్ మరింత పెరిగారనే చెప్పాలి. అయితే మరోసారి సందడి చేయడానికి బాలయ్య రెడీ అయ్యాడు. అన్ స్టాపబుల్ విత్ NBK2'తో బాలయ్య మళ్లీ నవ్వించడానికి మన ముందుకు రాబోతున్నారు. అయితే మొదటి సీజన్ కంటే రెండో సీజన్ ఇంకా గ్రాండ్‌గా మరింత ఉత్సాహంతో వర్క్ చేయనున్నారంట. అంతే కాకుండా ఈ సీజన్‌లో చీరంజీవి, అనుష్క శెట్టి వాళ్లు రానున్నారని టాక్ అలాగే ఓ ఎపిసోడ్‌లో చంద్రబాబు తీసుకరావడానికి ప్లాన్ చేస్తున్నట్లు టాక్. కానీ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

ఇవి కూడా చ‌ద‌వండి:

Puri Jagannadh తదుపరి చిత్రం ఆ హీరోతోనే!



Next Story

Most Viewed