ఉత్సాహభరితమైన వేడుకతో సెలబ్రేషన్స్ స్టార్ట్.. ‘కె-ర్యాంప్’ అప్డేట్ ఇచ్చిన మూవీ మేకర్స్

by Mallepaka Hamsa |

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) ‘క’ గత ఏడాది సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.

ఉత్సాహభరితమైన వేడుకతో సెలబ్రేషన్స్ స్టార్ట్.. ‘కె-ర్యాంప్’ అప్డేట్ ఇచ్చిన మూవీ మేకర్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) ‘క’ గత ఏడాది సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇక ఇటీవల ‘దిల్‌రూబా’ ప్రేక్షకులను అలరించాడు. కానీ హిట్ అందుకోలేకపోయాడు. ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తున్నారు. కిరణ్ అబ్బవరం నటిస్తున్న సినిమాల్లో ‘కె-ర్యాంప్’(K-Ramp) ఒకటి. ది రిచెస్ట్ చిల్లర్ గయ్ అనే ట్యాగ్‌లైన్‌తో రాబోతున్న ఈ చిత్రానికి జైన్స్ నాని(Jains Nani) దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో యుక్తి తరేజా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీని హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులోయిడ్స్ బ్యానర్స్‌పై రాజేశ్ దండ, శివ బొమ్మక్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో రాబోతున్న మూడవ ప్రాజెక్ట్ కావడం విటాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) ‘క’ గత ఏడాది సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.షం.

షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ‘కె-ర్యాంప్’ నుంచి వచ్చిన అప్డేట్స్ ప్రేక్షకులను ఆకట్టుకోగా.. త్వరలోనే చిత్రబృందం మ్యూజికల్ జర్నీ స్టార్ట్ చేయబోతున్నారు. ఈమేరకు ట్విట్టర్ ద్వారా అప్డేట్ రాబోతున్నట్లు అధికారిక ప్రకటన చేశారు. ‘కె-ర్యాంప్’ ఓనమ్ సాంగ్ ఆగస్టు 9న రాబోతున్నట్లు తెలుపుతూ ఓ పోస్టర్‌ను షేర్ చేశారు. ఇందులో ఎరుపు రంగు షర్ట్.. వైట్ కలర్ పంచెకట్టుకుని గాగుల్స్ పెట్టుకుని కిరణ్ అబ్బవరం కనిపించగా.. చుట్టూరా వైట్ చీరలు కట్టుకుని ఉన్న అమ్మాయిలు ఉన్నారు. ఇక ఈ పోస్ట్‌కు ఈ రిదమ్‌కు అందరూ డ్యాన్స్ చేస్తారు. ఉత్సాహభరితమైన వేడుకతో సెలబ్రేషన్స్‌ ప్రారంభం కాబోతున్నాయి’’ అనే క్యాప్షన్ జత చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది.

link

Next Story