మాస్ మెలోడీతో సెలబ్రేషన్స్ స్టార్ట్.. ‘కె-ర్యాంప్’ నుంచి అదిరిపోయే సాంగ్ విడుదల

by Mallepaka Hamsa |   (  Updated:2025-08-09 16:22:49  IST  )

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) ‘క’ సినిమాతో సూపర్ హిట్ అందుకుని ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు.

మాస్ మెలోడీతో సెలబ్రేషన్స్ స్టార్ట్.. ‘కె-ర్యాంప్’ నుంచి అదిరిపోయే సాంగ్ విడుదల
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) ‘క’ సినిమాతో సూపర్ హిట్ అందుకుని ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. ప్రస్తుతం వెరైటీ టైటిల్ ‘కె-ర్యాంప్’(K-Ramp)తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. జైన్స్ నాని (Jains Nani)దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యూలాయిడ్ బ్యానర్స్‌పై రాజేష్ దండా, శివ బొమ్మక్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం సరసన యుక్తి తరేజా(Yukti Tareja) హీరోయిన్‌గా నటిస్తోంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

తాజాగా, చిత్రబృందం రాఖీ పండుగ సందర్భంగా ‘కె-ర్యాంప్’ అప్డేట్ ఇచ్చారు. మ్యూజికల్ జర్నీ స్టార్ట్ చేసి మాస్ మెలోడీ సాంగ్‌తో సెలబ్రేషన్స్ ప్రారంభమైనట్లు తెలిపారు. ‘ఇన్‌స్టా ఆపేశానే.. ట్విట్టర్ మానేశానే.. నీకే ట్యాగ్ అయ్యానే మలయాళీ పిల్ల’ అని మొదలైన ఈ ఓనమ్ సాంగ్‌లో హీరో, హీరోయిన్ పంచెకట్టులో కనిపించి అందరినీ ఫిదా చేశారు. చేతన్ భరద్వాజ్, సాహితి చాగంటి పాడిన ఈ పాట కలర్‌ఫుల్‌గా ఉండి అందరినీ ఆకట్టుకుంటుంది. కాగా, ‘కె ర్యాంప్’ సినిమా అక్టోబర్ 18న థియేటర్స్‌లో విడుదల కాబోతుంది.

Next Story