స్నేహారెడ్డిని పెళ్లి చేసుకోవడానికి బన్నీ చేసిన త్యాగమేంటో తెలిస్తే షాక్!

by Disha Web Desk 9 |
స్నేహారెడ్డిని పెళ్లి చేసుకోవడానికి బన్నీ చేసిన త్యాగమేంటో తెలిస్తే షాక్!
X

దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - స్నేహారెడ్డి పెళ్లై మొన్నటికి విజయవంతంగా 13 ఏళ్లు గడిచాయి. ఈ సందర్భంగా బన్నీ.. ‘హ్యాపీ యానివర్సరీ మై క్యూటీ’ అంటూ స్నేహాకు విష్ చేస్తూ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఇక ప్రముఖ రాజకీయ నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి కుమార్తైన స్నేహను.. బన్నీ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. స్నేహంగా గా మొదలైన వీరి పరిచయం ప్రేమ వరకు వెళ్లింది. దీంతో బన్నీ స్నేహరెడ్డిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు.

ఇందుకు స్నేహా.. అల్లు అర్జున్ కు ఓ కండిషన్ పెట్టిందట. ‘‘నన్ను వివాహం చేసుకోవాలంటే ఎప్పటిలాగా అమ్మాయిలపై సెటైర్లు వేయడం, ఏడిపించడం, ఆట పట్టించడం వంటివి చేయొద్దు’’ అని స్నేహ.. బన్నీకి కండిషన్ పెట్టిందట. దీంతో ఈ హీరో స్నేహ ప్రేమ కోసం అవన్నీ అలవాట్లు మానుకుని తన ప్రేయసిని వివాహమాడాడని నెట్టింట టాక్. ప్రస్తుతం వీరు హ్యాపీగా ఇద్దరి పిల్లలతో జీవనం కొనసాగిస్తున్నారు. టాలీవుడ్ క్యూ టెస్ట్ అండ్ ఆదర్శవంతమైన కపుల్స్ గా అల్లు అర్జున్-స్నేహారెడ్డి పేరు సంపాదించుకున్నారు.


Next Story

Most Viewed