Bunny ఫ్యాన్స్ సిద్ధమైపోండి.. ‘Pushpa 2’ రిలీజ్ డేట్ వచ్చేసింది

by Disha Web Desk 7 |
Bunny ఫ్యాన్స్ సిద్ధమైపోండి.. ‘Pushpa 2’ రిలీజ్ డేట్ వచ్చేసింది
X

దిశ, సినిమా: అప్ కమింగ్ టాలీవుడ్ పాన్ ఇండియా చిత్రల్లో ‘పుష్ప 2’ ఒకటి. సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ఈ మూవీ కోసం అభిమానులంతా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కీలక సన్నివేశాలు షూట్ చేయగా చాలా వరకు వైజాగ్ పరిసర ప్రాంతాల్లో ఈ మూవీని షూట్ చేశారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీ‌లో చిత్రీకరణ జరుగుతోంది. ఇకపోతే తాజాగా నేడు రిలీజ్ డేట్‌పై అనౌన్స్‌మెంట్ చేసి ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్ చేశారు మేకర్స్. 2024 ఆగస్టు 15న ‘పుష్ప 2’ గ్రాండ్ రిలీజ్ అంటూ ట్వీట్ చేశారు. నిజానికి ఈ ఏడాది చివర్లో ఈ సినిమాను విడుదల చేయాల్సింది. కానీ సుకుమార్ ఈ మూవీని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు. అందుకే విడుదల వాయిదాపడుతూ వచ్చింది.

ఇవి కూడా చదవండి : రూ.520 కోట్ల మార్క్ దాటిన 'జవాన్' కలెక్షన్లు

Next Story

Most Viewed