- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హాలీవుడ్ స్టార్ సరసన ప్రియాంక చోప్రాకు బంపర్ ఆఫర్.. క్రేజీ అప్డేట్‌తో సోషల్ మీడియాలో షేక్
హాలీవుడ్ స్టార్ నటుడు ఓర్లాండో బ్లూమ్ సరసన ప్రియాంక చోప్రా నటించే లక్కీ ఛాన్స్ దక్కించుకుంది. వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న ఈ చిత్రానికి ‘రీసెట్’ అనే పవర్ ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు.

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తన కెరీర్‌లో మరో భారీ అడుగు వేస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ అగ్ర దర్శకుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’ షూటింగ్‌లో ఆమె ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది. ఈ సినిమాపై ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అంచనాలు ఉండగా, తాజాగా ప్రియాంకకు సంబంధించిన ఒక హాలీవుడ్ అప్‌డేట్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. హాలీవుడ్ స్టార్ నటుడు ఓర్లాండో బ్లూమ్ సరసన ప్రియాంక చోప్రా నటించే లక్కీ ఛాన్స్ దక్కించుకుంది. వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న ఈ చిత్రానికి ‘రీసెట్’ అనే పవర్ ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు ఫేమ్ మాట్ ఒక విభిన్నమైన సర్వైవల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నారు.
ఈ చిత్రం కథ మొత్తం ఒక దట్టమైన అడవి నేపథ్యంలో సాగుతుందని సమాచారం. ప్రాణాపాయ స్థితిలో చిక్కుకున్న ఒక మహిళను, ఒక అపరిచితుడు ఎలా కాపాడాడు? ఆ అడవిలో వారు ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి? అనే పాయింట్‌తో సినిమా చాలా ఉత్కంఠభరితంగా ఉంటుందట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అయితే ఈ తరహా పాత్రలు చేయడంలో ప్రియాంక దిట్ట. ఇప్పటికే ‘సిటాడెల్’ వంటి సిరీస్‌లతో తన సత్తా చాటుకుంది. ప్రియాంక చోప్రా ఈ సినిమాకు కేవలం హీరోయిన్ మాత్రమే కాదు, నిర్మాతగా కూడా వ్యవహరిస్తోంది. హీరో ఓర్లాండో బ్లూమ్‌తో కలిసి ఆమె ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తోంది. ఇదివరకే ‘ది బ్లఫ్’ సినిమాతో నిర్మాతగా సక్సెస్ అందుకున్న ప్రియాంక, ఇప్పుడు ‘రీసెట్’ సినిమాతో హాలీవుడ్‌లో తన నిర్మాణ విలువలని మరో స్థాయికి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తోంది. ఇటీవలే ‘సిటాడెల్ సీజన్-2’తో ప్రేక్షకులను అలరించిన ప్రియాంక, ఇప్పుడు ‘వారణాసి, ‘రీసెట్’ చిత్రాలతో గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమవుతోంది.






