'Brahmastra ఎఫెక్ట్: డైరెక్టర్, కరణ్‌పై Kangana Ranaut సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 6 |
Brahmastra ఎఫెక్ట్: డైరెక్టర్, కరణ్‌పై Kangana Ranaut  సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: 'బ్రహ్మస్త్ర' మూవీపై బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఈ మూవీపై స్పందించింది. ''అయాన్ ముఖర్జీని మేధావి అని పిలిచిన ప్రతి ఒక్కరినీ వెంటనే జైలులో పెట్టాలి. ఈ చిత్రాన్ని తీయడానికి 12 ఏళ్లు తీసుకున్నాడు. ఈ సినిమాను 400 రోజులకుపైగా షూట్ చేసి.. 14 మంది డీఓపీలను, 85 మంది అసిస్టెంట్ డైరెక్టర్లను మార్చి రూ.600 కోట్లు తగులబెట్టాడు. అంతేకాకుండా కంగనా, కరణ్‌పై కూడా ఫైర్ అయ్యింది.

అతను తన సినిమా స్క్రీప్ట్‌ల కంటే ప్రతి ఒక్కరి శృంగార జీవితంపైనే ఎక్కువ ఆసక్తిని చూపిస్తాడు. నకిలీ కలెక్షన్లు, ఫేక్ రివ్యూలు కొనుగోలు చేస్తాడు. హిందూ మతాన్ని, సౌత్‌వేవ్‌ను తొక్కే ప్రయత్నం చేశాడు. బ్రహ్మాస్త్ర సినిమా పేరును జలాలుద్దీన్ రూమీ నుంచి శివగా చివరి నిమిషంలో మార్చి మతపరమైన మనోభావాలను దెబ్బ తీసేందుకు ప్రయత్నించారు. ఇలాంటి అవకాశవాదులు, సృజనాత్మకత కోల్పోయిన వ్యక్తులు, విజయం కరువైన అత్యాశపరులను మేధావులని పిలవకూడదు''. అంటూ తీవ్ర విమర్శలు చేసింది.

కాగా, బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్‌బీర్ కపూర్, అలియా భట్ కలిసి నటించిన చిత్రం ' బ్రహ్మస్ట్ర'. దీనికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించగా, ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ నిర్మించారు. ఈ సినిమా బారీ అంచనాలతో ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ, అదే రోజున వినాయక శోభయాత్ర కావడంతో ట్రాఫిక్ వల్ల ప్రేక్షకులు సినిమాను ఎక్కువగా చూడలేకపోయారు. దీంతో బాక్సాఫీసు వద్ద ఎక్కువ వసూళ్లను రాబట్టలేక పోయింది.

Also Read : భారీ కలెక్షన్లతో రికార్డులు తిరగరాసిన బ్రహ్మస్త్ర

Also Read : ఆమె సింహాసనంపై దేవతలా కనిపిస్తుంది: Kangana Ranaut

Also Read : బ్రహ్మాస్త్ర ఎఫెక్ట్: అభిమానులపై హృతిక్ సీరియస్ (వీడియో)



Next Story