- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్టేజీపై శివాజీ కొడుకును చెంపదెబ్బ కొట్టిన బ్రహ్మానందం..
ఈవెంట్‌లో బ్రహ్మానందం స్టేజీ మీద మాట్లాడుతూ శివాజీ కొడుకు రిక్కీని పిలిచారు. రిక్కీని చూడగానే ఒక చెంపదెబ్బ కొట్టారు.

దిశ, సినిమా: టాలీవుడ్ సీనియర్ నటుడు బ్రహ్మానందం(Brahmanandam) తనదైన స్టైల్లో సరదాగా చేసే పనులు అప్పుడప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. తాజాగా శివాజీ, లయ ప్రధాన పాత్రల్లో నటించిన ‘సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ (Sampradayini Suppini Suddapoosani)సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో అలాంటి ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ మార్చి 6న విడుదల కాబోతుంది. దీంతో ప్రమోషన్స్‌లో భాగంగా చిత్రబృందం ప్రీ రిలీజ్ నిర్వహించగా.. ఈ ఈవెంట్‌లో బ్రహ్మానందం స్టేజీ మీద మాట్లాడుతూ శివాజీ కొడుకు రిక్కీని పిలిచారు. రిక్కీని చూడగానే సరదాగా ఒక చెంపదెబ్బ కొట్టి అందరినీ నవ్వించారు.
ఆ తర్వాత రిక్కీని ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘నిన్ను హీరోగా చేసే మొదటి సినిమాకు అడ్వాన్స్‌గా ఇద్దామనుకుంటున్నాను’’ అని అన్నారు. అక్కడే ఉన్న అలీ గారు స్పందిస్తూ.. నేను అప్పుడే డాలర్ నోటు అడ్వాన్స్‌గా ఇచ్చేశాను’’ అని చెప్పారు. దానికి బ్రహ్మీ తనదైన శైలిలో కౌంటర్ ఇస్తూ.. ‘ఇక్కడ డాలర్లు చెల్లవు, రూపాయలే ఉండాలి’ అని జోక్ చేశారు. అలీ పర్సులో నుంచి డబ్బులు తీసేలోపే, బ్రహ్మానందం గారు ఏమాత్రం ఆలోచించకుండా తన చేతికి ఉన్న బంగారు ఉంగరాన్ని తీసి రిక్కీకి బహుమతిగా ఇచ్చేశారు. ఒక సీనియర్ నటుడు తన అభిమానాన్ని ఇలా బంగారు ఉంగరం రూపంలో చాటుకోవడం చూసి అక్కడున్న వారంతా ఫిదా అయిపోయారు. శివాజీ, అతని కొడుకు రిక్కీ కూడా బ్రహ్మానందం గారి పెద్ద మనసు చూసి ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఈ క్యూట్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.






