Brahmamudi: అనామికను కొట్టిన కవి.. పోలీసులు ఎంట్రీతో నేటి ఎపిసోడ్ సూపర్

by Disha Web Desk 10 |
Brahmamudi: అనామికను కొట్టిన కవి.. పోలీసులు ఎంట్రీతో నేటి ఎపిసోడ్ సూపర్
X

దిశ, సినిమా: బ్రహ్మముడి ఎపిసోడ్ లో ఈ సీన్ హైలెట్

‘తను నా భార్యగా ఏ రోజు ప్రవర్తించలేదు అమ్మా.. మరి ముద్దుల కోడలు ఈ అత్తకు చెప్పకుండా ఎక్కడికి వెళ్లిందో.. అయినా తనకు కారణాలు వెతుక్కోవడం అలవాటే కదా.. ఇక్కడే ఎక్కడో ఒక చోట ఉంటుందిలే.. అని కవి అంటాడు. ఆ మాటలకు ఇంట్లో వాళ్లు షాక్ అవుతారు. ఏ ఎందుకు ‘ఏమైనా గొడవ జరిగిందా?’ అని ఇందిరా దేవి అడుగుతుంది. ‘అవును ఇష్టమొచ్చినట్టు వాగుతుంటే గుడిలో కొట్టాను’ అంటాడు కవి. అంతా షాక్ అవుతారు. సుభాష్, ప్రకాశం.. కవిని బాగా తిడతారు ‘ఆడపిల్ల మీద చేయి చేసుకోవడం మంచి పద్ధతేనా .. అంటూ సీరియస్ అవుతారు.

ఏమి చేయాలి మరి, భరించలేని కోపం వచ్చినప్పుడే కదా కొట్టేది.. ఆ సమయంలో నిర్ణయం తీసుకుని కొట్టాలా కొట్టలేం కదా? కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక కొట్టాను’ కవి అంటాడు. అప్పుడే పోలీసులతో ఎంట్రీ ఇచ్చిన అనామిక.. ‘ ఇప్పుడు మీరే చూసారు కదా .. కొట్టానని ఎంత ధైర్యంగా చెబుతున్నాడో?’ అని అనామిక అంటుంది. రుద్రాణి, రాహుల్ హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటే.. మిగిలిన వాళ్లంతా అలాగే చూస్తుంటారు. ఎస్ఐగారు నేను ఇందాక చెబితే మీరు నమ్మే పరిస్థితిలో లేరు.. అంటుంది అనాకానీ ఇప్పుడు మీరు చూసారుగా అని పోలీస్‌తో అంటుంది.



Next Story

Most Viewed