Brahmamudi : కుక్కినపేనులా పడి ఉండంటూ అనామికను తీసిపారేసిన అపర్ణ

by Disha Web Desk 10 |
Brahmamudi : కుక్కినపేనులా పడి ఉండంటూ అనామికను తీసిపారేసిన అపర్ణ
X

దిశ, సినిమా: బ్రహ్మముడి ఎపిసోడ్ లో ఈ సీన్ హైలెట్

ఈ సీరియల్ చూసే ప్రేక్షకులకు రక రకాల సందేహాలు వస్తున్నాయి. ఎందుకంటే సంబంధం లేని సీన్స్ తీసుకొస్తున్నారు. చూసే వాళ్లకి కూడా అర్ధం కాకుండా ఉంది. ఓ వైపు రాజ్ ఎవరికో పుట్టిన బిడ్డను తీసుకొచ్చి.. నా బిడ్డే అని చెప్పుకుంటున్నాడు.. మరో వైపు కావ్య కాపురం జవాబు లేని ప్రశ్న లా అయిపోయింది. డైరెక్టర్ చివరికి ఎలాంటి బాంబ్ పేలుస్తాడో?.. వేచి చూడాలి.. ఇక ,నేటి కథనంలోకి వెళ్తే..

ఏవమ్మా అనామిక అంత ఫీల్ అవుతున్నావ్ .. నీ పుట్టింటి ఆస్తి దానిలో దాచావా .. లేక మీ ఇంట్లో వాళ్లకు దీనిలో హక్కు ఏమైనా ఉందా.. కోడలిగా వచ్చినప్పుడు అలాగే ఉండాలి.. మొత్తం నాదే అంటూ అన్నింటిలో వేలు పెట్టకు.. మిగతా వాళ్లు ఎలా ఉంటున్నారు.. నువ్వు ఎలా ఉంటున్నావ్.. ఎక్కువ మాట్లాడకు.. కుక్కినపేనులా పడి ఉండు. మళ్లీ ఇదే రిపీట్ అయితే, శాంతను పని మానిపిస్తా. ఇంటి కోడలిగా మొత్తం నువ్వే చేయాలి జాగ్రత్త అంటూ అనామికకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది అపర్ణ. డాడీ నా మనసు బాగాలేక ఈ ఆర్డర్ పట్టించుకోలేదు. వాళ్లు వెయిట్ చేయలేక డ్రాప్ అయ్యారు అని రాజ్ చెబుతాడు.

ఇది పోతే ఇంకోటి వస్తుంది కదా .. ఆ నష్టాన్ని నేను పూర్తి చేస్తా.. ఇప్పుడు ఏంటీ పిన్ని నేను క్షమాపణలు చెప్పాలా.. నేను బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఇప్పుడు నష్టం వచ్చింది. కానీ, నా వల్ల చాలా లాభాలు కూడా వచ్చాయి. అసలు నేను ఎందుకు సారీ చెప్పాలి. నష్టానికా.. లాభాలకా.. మరి ఇంట్లో సంగతి ఏంటీ.. అక్కా చెల్లెళ్ళగా ఉండే మీ మధ్య సక్యత లేదు. దీనికి ఏమని సమాధానం చెప్తారని రాజ్ అంటాడు. ఇక్కడితో ఈ సీన్ ముగుస్తుంది.

Read More..

Guppedantha Manasu: మను గురించి చెబుతూ ఎమోషనల్ అయిన అనుపమ


Next Story

Most Viewed