- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Brahmamudi Today: వారం రోజులకే.. నీ కడుపేంటీ అంత పెరిగిందని స్వప్నని ప్రశ్నించిన భాగ్యలక్ష్మీ
బ్రహ్మముడి ఎపిసోడ్ లో ఈ సీను హైలెట్

దిశ,వెబ్ డెస్క్: బ్రహ్మముడి ఎపిసోడ్ లో ఈ సీను హైలెట్
ఇంట్లో వాళ్లంతా.. స్వప్నని తీసుకుని వెళ్లిన వాడిని విడిచి పెట్టకూడదు.. వాడి మీద కారణం యాసిడ్ పొయ్యాలి.. కాళ్లు విరిచేయాలని అందరూ ఇష్టమొచ్చినట్టు తిడుతూ ఉంటారు. అప్పుడు రుద్రాణి ఆ మాట విని తట్టుకోలేదు. ‘ఇప్పుడు అవసరమా? అదంతా? స్వప్నకు ఏమి కాలేదు కదా.. తనకు ఏదైనా తినడానికి పెట్టండి.. రాహుల్ స్వప్నని తీసుకుని లోపలికి వెళ్లు నాన్నా’ అంటూ మహానటి రేంజులో నటిస్తుంది. ఇక అప్పుడే స్వప్న కడుపుని గమనించిన భాగ్యలక్ష్మీ.. ‘ స్వప్న ఆగు .. ఏంటి నీ కడుపు అప్పుడే అంత పెరిగింది? వారం రోజులకే అంత పెరిగిందా? అంటూ అడుగుతుంది. అప్పుడు స్వప్నకి ఏమి చెప్పాలో కూడా అర్ధం కాదు . భాగ్యలక్ష్మి అనుమానపు మాటలకి.. స్వప్నతో పాటు కావ్య కూడా భయపడుతుంది. అందరూ అనుమానంగానే చూస్తారు. అయితే స్వప్న కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది.
Read More: Guppedantha Manasu : జగతిని చంపడానికి మరో ప్లాన్ వేసిన దేవయాని,శైలేంద్ర






