మ‌రో యాక్ష‌న్ క‌థ సిద్ధం చేసిన బోయపాటి, హీరో ఎవ‌రంటే ?

by velandi.Saikiran |

తమిళ హీరో కార్తీక్ కోసం అదిరిపోయే కథను బోయపాటి శ్రీను రెడీ చేస్తున్నట్లు సినీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

మ‌రో యాక్ష‌న్ క‌థ సిద్ధం చేసిన బోయపాటి, హీరో ఎవ‌రంటే ?
X

దిశ‌, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో బోయపాటి శ్రీను గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మాస్ సినిమాలు తీయడంలో ఆయన దిట్ట. ఇప్పటికే నందమూరి బాలయ్యతో నాలుగు సినిమాలు చేసిన బోయపాటి శ్రీను... అన్ని బంపర్ హిట్స్ అందుకున్నారు. లేటెస్ట్ గా అఖండ 2తో బోయ‌పాటి శ్రీను ఇండస్ట్రీని షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారట. తమిళ హీరో కార్తీక్ కోసం అదిరిపోయే కథను బోయపాటి శ్రీను రెడీ చేస్తున్నట్లు సినీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

తమిళ హీరో కార్తీక్ కోసం అదిరిపోయే కథ?

బాలయ్య నటించిన అఖండ 2 సినిమా రిలీజ్ అయిన తర్వాత బోయపాటి ఏ ప్రాజెక్టు పైన కూడా ప్రకటన చేయలేదు. ఈ తరుణంలోని క్లాస్ తో పాటు మాస్ అప్పీల్ ఉన్న హీరో కార్తీతో ఆయన సినిమా చేసే అవకాశం ఉన్నట్టు చర్చ జరుగుతోంది. కార్తీకు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. అత‌నితో సినిమా చేస్తే, త‌మిళ్ లో కూడా బోయ‌పాటికి క్రేజ్ పెరిగే ఛాన్స్ ఉంది. అందుకే ఈ ప్లాన్ చేసిన‌ట్లు టాక్ న‌డుస్తోంది. దీనిపై అతి త్వరలోనే ప్రకటన వస్తుందని కూడా చెబుతున్నారు. అయితే ఈ సినిమా కూడా యాక్షన్ డ్రామా నేపథ్యంలోనే ఉంటుందని టాక్.

Next Story