Boney Kapoor: సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకున్న బోనీ కపూర్..

by Dishanational2 |
Boney Kapoor
X

దిశ, సినిమా: టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి సైబర్ నేరాలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఇక ఈ సైబర్ నేరగాళ్ల ఉచ్చికి చిక్కిన ఎందరో అమాయకులు మోసపోతూనే ఉన్నారు.. అయితే అందులో పెద్దపెద్ద సెలబ్రెటీలు కూడా సైబర్ నేరగాళ్ల గాలనికి చిక్కడం గమనర్హం. ఇక తాజాగా.. బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ బోనీ కపూర్(Boney Kapoor) కూడా సైబర్ నేరగాళ్ల వలలో చిక్కారు. అనంతరం తన క్రెడిట్ కార్డు ద్వారా మొత్తం రూ. 3.82 లక్షలు నేరగాళ్లు దొంగిలించారు. ఇక దీనిపై కపూర్ ముంబైలోని అంబోలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం బోనీ క్రెడిట్ కార్డు నుంచి మొత్తం ఐదు లావాదేవీలు జరిగినట్లు కనుగోన్నారు. దీంతో బోని కపూర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.



Next Story

Most Viewed