Mahesh-Rajamouli మూవీలో Amitabh Bachchan..

by Disha Web Desk 7 |
Mahesh-Rajamouli మూవీలో Amitabh Bachchan..
X

దిశ, సినిమా: సూపర్ స్టార్ మహేష్‌ బాబు, పాన్ ఇండియా దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న మహేష్ బాబు.. ఆ మూవీ అనంతరం రాజమౌళితో సినిమా స్టార్ట్ చేయబోతున్నారు. ఈ మేరకు ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. 'ఇండియానా జోన్స్' తరహాలో భారీ స్థాయిలో తెరపైకి తీసుకురాబోతున్న ఈ సినిమాకు సంబంధించి జక్కన ఇప్పటికే కొన్ని హింట్స్ కూడా ఇచ్చారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. ఈ మూవీలో మహేష్ ఫాదర్ క్యారెక్టర్ చాలా కీలకంగా ఉంటుందని తెలుస్తోంది. అందుకే ఈ పాత్రకు గాను బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్‌ను అనుకుంటున్నారట. అమితాబ్ అయితేనే ఈ పాత్రకు కరెక్ట్‌గా సూట్ అవుతాడని రాజమౌళి గట్టిగా ఫిక్స్ అయ్యారు. కానీ దీని గురించి అధికారికంగా ప్రకటన చేయలేదు.

Also Read....

Salman Khan, Pooja Hegde డేటింగ్.. సిగ్గుందా అంటూ ఫైర్ అయిన ఫ్రెండ్


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed