- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘NC-24’లో యంగ్ హీరో కీ రోల్.. ఈ ప్రపంచం అతన్ని మునుపెన్నడూ చూడని అవతారంలో చూడబోతుందంటూ మేకర్స్ పోస్ట్
అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya) ఇటీవల ‘తండేల్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.

దిశ, సినిమా: అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya) ఇటీవల ‘తండేల్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం చైతు తన కెరీర్‌లో 24న చిత్రంగా రాబోతున్న ‘NC-24’తో ఫుల్ బిజీ అయిపోయాడు. ఈ సినిమాకు హిట్ డైరెక్టర్ ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండు (Karthik Dandu)దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి నటిస్తున్నట్లు సమాచారం. ఈ మూవీని సుకుమార్ రైటింగ్స్, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌లో బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ మైథిలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి ఎప్పుడెప్పుడు అప్డేట్స్ వస్తాయా? అని అక్కినేని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
ఈ నేపథ్యంలో.. తాజాగా, ‘NC-24’ చిత్రబృందం ఇందులో బాలీవుడ్ యంగ్ హీరో కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుపుతూ ఆయనకు స్వాగతం చెప్తూ పోస్ట్ పెట్టారు. బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం ‘లపతా లేడీస్’లో నటించిన హీరో స్పర్ష్ శ్రీవాస్తవ(Sparsh Srivastava) ‘NC-24’ భాగం అయ్యాడు. నేడు అతని పుట్టినరోజు కావడంతో విషెస్ తెలుపుతూ.. ‘‘ఇప్పటివరకు ఈ ప్రపంచం అతని అందమైన ముఖాన్నే చూసింది. ఇప్పుడు మునుపెన్నడూ చూడని అవతారాన్ని చూడబోతుంది. పుట్టినరోజు శుభాకాంక్షలు స్పర్ష్. ‘NC-24’ ప్రపంచంలోకి స్వాగతం’’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచుతోంది. కార్తీక్ దండు ఈ సినిమా కోసం బాలీవుడ్ హీరోను రప్పించడంతో అందరి దృష్టి ‘NC-24’ పడింది. డైరెక్టర్ నాగచైతన్య మూవీని గట్టిగానే ప్లాన్ చేస్తుండటంతో అంతా థియేటర్స్‌లోకి ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.






