పెళ్లిలో డ్యాన్స్‌కు రూ. 2.5 కోట్లు తీసుకున్న బాలీవుడ్ హీరో

by Aamani |
పెళ్లిలో డ్యాన్స్‌కు రూ. 2.5 కోట్లు తీసుకున్న బాలీవుడ్ హీరో
X

దిశ, సినిమా: షారుఖ్ ఖాన్, రణ్‌వీర్ సింగ్ లాంటి బాలీవుడ్ హీరోలు వివాహాల్లో పర్ఫార్మ్ చేస్తారనే సంగతి తెలిసిందే. అయితే ఈ పర్ఫామెన్స్‌కు లక్షలు కాదు ఏకంగా కోట్లలోనే పారితోషికం తీసుకుంటున్నారని టాక్. అయితే ఈ లిస్ట్‌లోకి రీసెంట్‌గా యాడ్ అయిన హృతిక్ రోషన్.. ఓ వివాహ వేడుకలో సందడి చేశాడు. తన పాపులర్ సాంగ్స్‌కు అదిరిపోయే స్టెప్స్ వేసి అలరించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే ఇంతకు మించిన విశేషం ఏంటంటే.. ఈ పర్ఫార్మెన్స్‌కు ఆయన ఏకంగా రూ. 2.5 కోట్లు తీసుకున్నాడని సమాచారం.

Next Story