- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అక్కినేని హీరో ‘లెనిన్’ సినిమాలో స్పెషల్ సాంగ్‌లో చిందులేయనున్న బాలీవుడ్ బ్యూటీ.. వద్దు బాబోయ్ అంటున్న నెటిజన్లు
బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే (Ananya Pandey)‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ (Student of the Year)చిత్రంతో ఇండస్ట్రీకి వచ్చింది.

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే (Ananya Pandey)‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ (Student of the Year)చిత్రంతో ఇండస్ట్రీకి వచ్చింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి అనతి కాలంలోనే ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. తెలుగులో ‘లైగర్’ మూవీలో నటించింది.. కానీ అంతగా కలిసి రాలేదు. దీంతో మళ్లీ బాలీవుడ్‌పై ఫోకస్ పెట్టింది. ఇక ఇటీవల కంట్రోల్, కేసరి చాప్టర్-2 (Kesari Chapter-2)వంటి చిత్రాలతో వరుస హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, అనన్య పాండే ఓ బంపర్ ఆఫర్ అందుకున్నట్లు సమాచారం. అక్కినేని అఖిల్(Akhil) నటిస్తున్న ‘లెనిన్’(Lenin) సినిమాలో స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు సమాచారం.
మురళీ కిషోర్ అబ్బూరి (Murali Kishore Abburi)దర్శకత్వం వహిస్తుండగా.. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై అక్కినేని హీరో నాగార్జున, నాగవంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్న ఈ సినిమాలో డీ గ్లామరస్ లుక్‌లో కనిపించనున్నాడు. ఇక ఇందులో అఖిల్ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో అనన్య స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు పలు పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు అస్సలు వద్దు అని అంటున్నారు నెటిజన్లు.






