- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సుధీర్ బాబు ‘జటాధర’ సినిమా కోసం రంగంలోకి బాలీవుడ్ బ్యూటీ .. చెమటలు పట్టడం ఖాయం!
టాలీవుడ్ హీరో సుధీర్ బాబు(Sudheer Babu) గత ఏడాది ‘హరోం హర’ సినిమాతో ప్రేక్షకులను అలరించారు.

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో సుధీర్ బాబు(Sudheer Babu) గత ఏడాది ‘హరోం హర’ సినిమాతో ప్రేక్షకులను అలరించారు. కానీ హిట్ అందుకోలేకపోయారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జటాధర’. ఈ చిత్రానికి వెంకటేష్ కళ్యాణ్(Venkatesh Kalyan), అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహిస్తుండగా.. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పణలో రాబోతుంది. డివోషనల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతుండగా.. ఇందులో బాలీవుడ్ స్టార్ బ్యూటీ సోనాక్షి సిన్హా(Sonakshi Sinha) హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే దివ్య ఖోస్లా, శిల్పా శిరోద్కర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.
ఇప్పటికే ఇందులోంచి వచ్చిన పోస్టర్స్, టీజర్, గ్లింప్స్ మంచి రెస్సాన్స్‌ను దక్కించుకున్నాయి. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రేయా శర్మ ఐటమ్ సాంగ్‌లో సుధీర్ బాబు సరసన చిందులేయబోతున్నట్లు సమాచారం. మూవీ మేకర్స్ శ్రేయాను సంప్రదించగా.. అందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈవిషయం తెలుసుకున్న నెటిజన్లు చెమటలు పట్టడం ఖాయమని కామెంట్లు పెడుతున్నారు.






