షూటింగ్‌లో గాయపడ్డ బాలీవుడ్ నటి.. ఆందోళనలో ఫ్యాన్స్

by Mallepaka Hamsa |   (  Updated:2023-03-16 08:03:25  IST  )

దివంగత నటుడు ఉదయ్ కిరణ్, దివ్య ఖోస్లా‍ కలయికలో వచ్చిన సినిమా ‘లవ్ టూడే’. 2004లో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది..

షూటింగ్‌లో గాయపడ్డ బాలీవుడ్ నటి.. ఆందోళనలో ఫ్యాన్స్
X

దిశ, సినిమా: దివంగత నటుడు ఉదయ్ కిరణ్, దివ్య ఖోస్లా‍ కలయికలో వచ్చిన సినిమా ‘లవ్ టుడే’. 2004లో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక తాజాగా, ఈ సినిమా నటి తీవ్ర గాయాలతో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘నా రాబోయే సినిమా ‘యారియా-2’ షూటింగ్‌లో ఒక యాక్షన్ సీన్ చిత్రీకరిస్తుండగా నా ముఖంపై తీవ్రంగా గాయమైంది. కానీ, షూటింగ్ మాత్రం కొనసాగాలి. నేను ‍త్వరగా కోలుకోవడానికి మీ అందరి ఆశీస్సులు కావాలి’ అంటూ పోస్ట్ చేసింది. ప్రస్తుతం వైరల్ అవుతున్న పిక్స్‌పై పాజిటీవ్‌గా స్పందిస్తున్న ఫ్యాన్స్.. ‘గెట్ వెల్ సూన్’ అంటూ పోస్టులు పెడుతున్నారు.

Next Story