- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘సూర్య-46’లో కీలక పాత్రలో బాలీవుడ్ నటుడు.. క్యూరియాసిటీ పెంచుతున్న పోస్ట్
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(suriya) హిట్ ఫ్లాప్ అని ఆలోచించకుండా భారీ ప్రాజెక్స్ అనౌన్స్ చేస్తున్నారు.

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(suriya) హిట్ ఫ్లాప్ అని ఆలోచించకుండా భారీ ప్రాజెక్స్ అనౌన్స్ చేస్తున్నారు. తెలుగులో ఆయన ఓ భారీ ప్రాజెక్ట్‌తో ఫుల్ బిజీ అయిపోయారు. వెంకీ అట్లూరీ(Venky Atluri) దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో సూర్య సరసన కోలీవుడ్ బ్యూటీ మమిత బైజు(Mamita Baiju) హీరోయిన్‌గా నటిస్తుండగా.. రవీనా టాండన్, రాధిక అప్టే కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తి కాగా.. త్వరలో షూటింగ్ కూడా స్టార్ట్ కాబెతున్నట్లు సమాచారం. ఈనేపథ్యంలో.. ఈ మూవీలో నటిస్తున్న నటీనటులకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో బాలీవుడ్ స్టార్ నటుడు అనిల్ కపూర్(Anil Kapoor) కీలక పాత్రలో నటిస్తున్నట్లు టాక్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు నెట్టింట వైరల్ అవుతుండటంతో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఆయన ఏ పాత్రలో నటిస్తున్నాడో తెలుసుకోవాలనే ఆసక్తి పెరిగింది.






