ఓటీటీలోకి రాబోతున్న బ్లాక్ బస్టర్ హిట్ మూవీ .. స్ట్రీమింగ్ డేట్‌పై అధికారిక ప్రకటన విడుదల

by Mallepaka Hamsa |

బాలీవుడ్ నటుడు చుంకీ పాండే తనయుడిగా అహాన్ పాండే(Ahaan Panday) ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఆయన నటించిన మూవీ ‘సైయారా’(Saiyara).

ఓటీటీలోకి రాబోతున్న బ్లాక్ బస్టర్ హిట్ మూవీ .. స్ట్రీమింగ్ డేట్‌పై అధికారిక ప్రకటన విడుదల
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటుడు చుంకీ పాండే తనయుడిగా అహాన్ పాండే(Ahaan Panday) ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఆయన నటించిన మూవీ ‘సైయారా’(Saiyara). మోహిత్ సూరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాతో అనీత్ పడ్డా (Aneeth Padda)కూడా ఇండస్ట్రీకి పరిచయం అయింది. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం జూలై 18న థియేటర్స్‌లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అంతేకాకుండా భారీ కలెక్షన్లు రాబట్టి బాక్సాఫీసు వద్ద పలు రికార్డులు క్రియేట్ చేసి సంచలనం సృష్టించింది. అలాగే పలువురు సినీ సెలబ్రిటీల ప్రశంసలు పొందిన ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా? అని సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా, ‘సైయారా’ డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైనట్లు ప్రముక సంస్థ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ హక్కులను నెట‌ఫ్లిక్స్ సొంతం చేసుకోగా.. సెప్టెంబర్ 12 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు వెల్లడించారు. ‘‘కొన్ని క్షణాలు మిగిలి ఉన్నాయి, అప్పుడు సైరా కథ మీదే అవుతుంది’’ అనే క్యాప్షన్ జత చేశారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రియులంతా సూపర్ ఎగ్జైటెడ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Next Story