- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్లాక్ బస్టర్ చిత్రం ‘గబ్బర్ సింగ్’ నేటికి 11 ఏళ్లు పూర్తి..!
by Kodari Anjali |
పవర్ స్టార్ పవన్ అభిమానులకు ‘‘గబ్బర్ సింగ్’’ సినిమా చాలా స్పెషల్.

X
దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ అభిమానులకు ‘‘గబ్బర్ సింగ్’’ సినిమా చాలా స్పెషల్. హిట్ కోసం దాదాపు పదేళ్లు వెయిట్ చేసిన అభిమానులకు దర్శకుడు హరీష్ శంకర్ మాంచి మాస్ మసాలా సినిమాతో ఆకలి తీర్చాడు. పవన్ కళ్యాణ్ కేరిర్‌లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలవడంతో పాటు ఇండస్ట్రీలోని అనేక రికార్డులని తిరగ రాసింది. అయితే, ఈ సినిమా విడుదలయి నేటికి సరిగ్గా 11 ఏళ్ళు పూర్తి అయ్యింది.
దీంతో ఫాన్స్ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతూ రచ్చ చేస్తున్నారు. నాటి రికార్డులను గుర్తు చేసుకుంటూ ట్విట్టర్‌లో ట్రెండ్ చేస్తున్నారు. కాగా, ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన శృతి హాసన్ నటించగా, బండ్ల గణేష్ నిర్మాతగా వ్యవహరించారు. ప్రస్తుతం పవర్ స్టార్, హరీష్ కాంబినేషన్‌లో వస్తోన్న ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ నుంచి ఈ రోజు సాయంత్రం 4.59 గంటలకు ఫస్ట్ గ్లింప్స్ విడుదల కానుంది.
Next Story






