సల్మాన్ ఖాన్ ఫొటోతో దర్శనమిచ్చిన బిల్ గేట్స్‌!

by Dishanational2 |
సల్మాన్ ఖాన్ ఫొటోతో దర్శనమిచ్చిన బిల్ గేట్స్‌!
X

దిశ, సినిమా : మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఇటీవల ప్రారంభించిన తన పాడ్ కాస్ట్ ‘అన్‌కన్‌ఫ్యూజ్ విత్ బిల్ గేట్స్‌’ షోకు మంచి స్పందన వస్తోంది. ఇందులో భాగంగా ఆ ప్రోగ్రామ్ రెండో ఎపిసోడ్‌లో అమెరికాకు చెందిన ఫేమస్ ‘ఎన్జీవో సంస్థ ఖాన్ అకాడమీ’ వ్యవస్థాపకుడు సాల్ ఖాన్‌తో ఆయన ఇంటర్వ్యూ చేశారు. కాగా ఆ ఇంటర్వ్యూలో భాగంగా బిల్ గేట్స్ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ గురించి సాల్ ఖాన్‌కు ఓ ప్రశ్న వేశారు. సల్మాన్ ఖాన్ ఫొటోను చూపిస్తూ ‘మీరు సల్మాన్ ఖాన్ అని ఎవరైనా పొరబడ్డారా?’ అని సాల్ ఖాన్‌ను బిల్ గేట్స్ ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు బిలియనీర్ సాల్ ఖాన్ నవ్వుతూ స్పందిస్తూ.. ‘సల్మాన్ ఖాన్ గురించి నాకు తెలుసు నేను అకాడమీ ప్రారంభించిన కొత్తలో.. ఆ నటుడి ఫ్యాన్స్ నుంచి నాకు పొరపాటున మెయిల్స్ వచ్చేవి. నువ్వంటే నాకు ఇష్టమని, కానీ మీరు గణితాలు ఎలా చేస్తారో అన్న టెన్షన్ ఉంది ఆ లేఖలో రాసేవారు’ అని సాల్ ఖాన్ తెలిపారు. దీంతో బిల్ గేట్స్ బాగా నవ్వారు.

Read More: జాతీయ జెండాను అవమానించిన బాలీవుడ్ నటి.. సిగ్గులేదంటూ నెటిజన్లు ఫైర్


Next Story

Most Viewed