మంచు మనోజ్ చేతుల మీదుగా.. బిగ్ బాస్ విన్నర్ సినిమా ట్రైలర్ లాంచ్

by Disha Web Desk 7 |
మంచు మనోజ్ చేతుల మీదుగా.. బిగ్ బాస్ విన్నర్ సినిమా ట్రైలర్ లాంచ్
X

దిశ, వెబ్‌డెస్క్: బిగ్ బాస్ ద్వారా క్రేజ్ తెచ్చుకున్న వారిలో కౌశల్ ఒకరు. బుల్లితెర యాక్టర్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈయన.. బిగ్ బాస్ సీజన్ 2కి విన్నరై మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు హీరోగా ‘రైట్’ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మణి దీప్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రం మలయాళ హిట్ సినిమా ‘మెమోరీస్’కి రీమేక్ కావడం విశేషం. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. హీరో మంచు మనోజ్ చేతుల మీదుగా.. ట్రైరల్ లాంచ్ చేశారు.

అనంతరం మనోజ్ మాట్లాడుతూ.. ‘కౌశల్ తన స్వశక్తితో ఎదిగిన వ్యక్తి. తనకంటూ ఒక ఆర్మీనే ఉందంటే అది సామాన్యమైన విషయం కాదు. ఎన్నో కష్టాలు చూసి ఈ స్థాయికి వచ్చిన కౌశల్ ఈ ఇయర్ ఎండింగ్‌లో హిట్ కొట్టి తన ప్రస్థానాన్ని కొనసాగించాలి. రైట్ మూవీ ట్రైలర్ చాలా బాగుంది. ఈ సినిమా తప్పకుండా హిట్ కొడుతుందని ఆశిస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు. కాగా.. డిసెంబర్ 30న విడుదల కాబోతున్న ఈ చిత్రంలో కౌశల్‌కు జోడిగా లీషా ఎక్లైర్స్ నటించింది.

Read More..

బిగ్‌బాస్-7 విన్నర్ పల్లవి ప్రశాంత్‌పై వేణు స్వామి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Next Story

Most Viewed