- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Bigg Boss Telugu Season 9: బిగ్‌బాస్ సీజన్ 9 ముహూర్తం ఖరారు.. ఈ బ్యూటిఫుల్ గర్ల్ పక్కా ఉండనుందట?
ఇప్పటివరకు తెలుగులో విజయవంతంగా 8 బిగ్‌బాస్ సీజన్లు కంప్లీట్ అయ్యాయి.

దిశ, వెబ్‌డెస్క్: ఇప్పటివరకు తెలుగులో విజయవంతంగా 8 బిగ్‌బాస్ సీజన్లు కంప్లీట్ అయ్యాయి. రీసెంట్‌గా ముగిసిన బిగ్‌బాస్ సీజన్- 8 (Bigg Boss Telugu Season)లో నిఖిల్(Nikhil) విన్నర్‌గా నిలువగా.. గౌతమ్ రన్నర్‌గా నిలిచారు. తెలుగులో మొదటిసారిగా 2017లో బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 స్టార్ట్ అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్ (Jr. NTR)హోస్ట్‌గా చేసిన బిగ్ బాస్ తెలుగు 1 విన్నర్‌గా నటుడు శివ బాలాజీ (Shiva Balaji) గెలిచాడు. విజేతగా నిలిచిన శివ బాలాజీకి 50 లక్షల రూపాయల ప్రైజ్ అందించారు. తర్వాత సీజన్‌లో కౌశల్ మండా గెలిచి రూ. 50 లక్షలు గెలుచుకున్నాడు. మూడో సీజన్‌లో సింగర్ రాహుల్ సిప్లిగంజ్(Singer Rahul Sipligunj) విన్నర్, రన్నర్ శ్రీముఖి, నాలుగో సీజన్‌లో అభిజీత్(Abhijeet), ఐదో సీజన్‌లో వీజే సన్నీ, తర్వాత వరుసగా రేవంత్, పల్లవి ప్రశాంత్(Pallavi Prashanth).. ఎనిమిదో సీజన్ విజేత నిఖిల్‌గా నిలిచారు.
అయితే తొమ్మిదో సీజన్ ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందని బిగ్ బాస్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సీజన్ 9 కు ముహూర్తం ఖరారు అయినట్లు జనాలు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. మరీ ఈ వార్త ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ సమ్మర్‌లో ప్రారంభమవ్వబోతుందట. మే ఫస్ట్ వీక్‌లో స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇప్పుడు హౌస్‌లో ఎంట్రీ ఇచ్చేవాళ్లు కాస్త స్టార్ డమ్ ఉన్నవాళ్లేనని తెలుస్తోంది. ముఖ్యంగా ఇందులో వర్షిణి(Varshini) అయితే పక్కా పాల్గొంటుందంటూ నెటిజన్లు అంచనా వేస్తున్నారు. ఈసారి సీజన్-9 మిగతా సీజన్ల కంటే డిఫరెంట్‌గా ఉండబోతుందట.






