Bigg Boss-9: రీతూ చేసిన పనికి కంటెస్టెంట్స్ అంతా బలి.. చివర్లో ట్విస్ట్ అదిరిపోయిందిగా!

by Mallepaka Hamsa |   (  Updated:2025-10-15 05:57:43  IST  )

తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్(Bigg Boss-9) ఐదో వారం కొనసాగుతోంది.

Bigg Boss-9: రీతూ చేసిన పనికి కంటెస్టెంట్స్ అంతా బలి.. చివర్లో ట్విస్ట్ అదిరిపోయిందిగా!
X

దిశ, సినిమా: తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్(Bigg Boss-9) ఐదో వారం కొనసాగుతోంది. ఇక ఈ సారి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు కూడా ఉంబోతున్నట్లు.. నామినేషన్స్‌లోనే బిగ్‌బాస్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ వారం నామినేషన్స్‌లో కెప్టెన్‌గా ఉన్న రామ్ రాథోడ్, ఇమాన్యుయేల్ తప్ప మిగతా 9 మంది డేంజర్‌ జోన్‌లో ఉన్నారు. దీంతో బిగ్‌బాస్ వారికి ఇమ్మూనిటీ ఇచ్చేందుకు పలు టాస్కులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఓ టాస్క్‌లో రీతూ చేసిన పనికి బిగ్‌బాస్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతేకాకుండా ఆమె చేసిన పనికి మిగతా వారిని శిక్షించాడు. అసలు ఏం జరిగిందో ఇక్కడ తెలుసుకుందాం.. ఇకనుంచి హౌస్‌లో ఓనర్స్, టెనెంట్స్ ఉండరని చెప్పిన బిగ్‌బాస్.. ఛాలెంజెస్ టాస్కుల కోసం అందిరినీ జంటలుగా చేశాడు. ఇందులో పవన్-రీతూ, సంజన-ఫ్లోరా, శ్రీజ-సుమన్, కళ్యాణ్-తనూజ జత కట్టారు.

ఇందులో బెలూన్ టాస్క్ పెట్టారు. ఓ జంటలోని ఓ వ్యక్తి బాక్స్‌లో సూదులతో ఉన్న మాస్క్ పెట్టుకుని తల పెట్టాల్సి ఉంటుంది. మరో వ్యక్తి బెలూన్‌ని లోపల వేయాలి. బాక్స్‌లో ఉన్న సభ్యుడు ఆ బెలూన్ తన మాస్క్‌కి ఉన్న నీడిల్స్‌కి తగిలి పగిలిపోకుండా ఊదుతూ గాల్లో ఉంచాలి. కానీ రీతూ(Rithu Chaudhary) చావు తెలివితేటలు చూపించి.. పవన్ వెనుక బెలూన్ ఉంచింది. దీంతో శ్రీజ(Sreeja), తనూజ కూడా అదే ఫాలో అయిపోయారు. ఇక అది గమనించిన బిగ్‌బాస్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అసలు మోసాన్ని బయటపెట్టాడు. ఇది ఆటకే విరుద్ధం అని.. సంజన-ఫ్లోరా తప్పితే మిగతా వారంతా ఉన్న పాయింట్లలో సగం కట్ చేశాడు. దీంతో గేమ్ ఆడినా సరే గెలవలేదని సంజన ఆవేదన వ్యక్తం చేస్తూ బోరున ఏడ్చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు రీతూని ఏకిపారేస్తున్నారు.

Next Story