బిగ్‌బాస్ ఫేమ్ గౌతమ్ మూవీ ‘సోలో బాయ్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. రొమాంటిక్ పోస్టర్ విడుదల

by Mallepaka Hamsa |

బుల్లితెర నటుడు గౌతమ్ కృష్ణ(Gautam Krishna) పలు ప్రైవేట్ సాంగ్స్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

బిగ్‌బాస్ ఫేమ్ గౌతమ్ మూవీ ‘సోలో బాయ్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. రొమాంటిక్ పోస్టర్ విడుదల
X

దిశ, సినిమా: బుల్లితెర నటుడు గౌతమ్ కృష్ణ(Gautam Krishna) పలు ప్రైవేట్ సాంగ్స్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ ద్వారా ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు. నటనపై ఆసక్తితో గౌతమ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ‘సోలో బాయ్’ (solo boy) మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నవీన్ కుమార్(Naveen Kumar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్వేతా అవస్తి, రమ్య పసుపులేటి(Ramya Pasupuleti) హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఈ చిత్రాన్ని సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్‌పై సతీష్ కుమార్ నిర్మిస్తున్నారు.

ఇందులో పోసాని కృష్ణ మురళి, అనిత చైదరి, అరుణ్ కుమార్, ఆర్కే మామ, షఫీ, డాక్టర్ భద్రం కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన సాంగ్, ఫస్ట్ లుక్ పోస్టర్ మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. తాజాగా, మూవీ మేకర్స్ ‘సోలో బాయ్’ విడుదల తేదీని ప్రకటించారు. ఈ సినిమా జూలై 4న థియేటర్స్‌లోకి రాబోతున్నట్లు ప్రకటించారు. ఇక ఇందులో ఒక అమ్మాయితో రొమాంటిక్ పోజ్ పెట్టి.. రమ్మ పసుపులేటితో కాలేజికి పోతున్నట్లుగా కనిపించాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ సినీ ప్రియులను ఆకట్టుకుంటుంది.

Next Story