అయోధ్య రామ మందిరానికి బిగ్‌బాస్ ఆదిరెడ్డి విరాళం.. ఎంత ఇచ్చాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

by Mallepaka Hamsa |

ఉత్తర ప్రదేశ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రామమందిరం త్వరలో ప్రారంభం కానుంది.

అయోధ్య రామ మందిరానికి బిగ్‌బాస్ ఆదిరెడ్డి విరాళం.. ఎంత ఇచ్చాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
X

దిశ, సినిమా: ఉత్తర ప్రదేశ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రామమందిరం త్వరలో ప్రారంభం కానుంది. జనవరి 22న ఈ వేడుక జరగనుంది. ఈ క్రమంలో పలువురు ప్రముఖులు మందిరానికి విరాళాలు అందజేస్తున్నారు. తాజాగా, బిగ్‌బాస్ ఫేమ్ ఆదిరెడ్డి కూడా రామమందిరానికి విరాళం అందజేశారని తెలుస్తోంది. ఈ విషయాన్ని తెలుపుతూ ఆదిరేడ్డి తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియోను షేర్ చేశాడు. ‘‘జై శ్రీ రామ్.. మన సబ్ స్కైబర్లందరూ బాగుండాలని, దీంతో పాటు మా ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ కూడా బాగుండాలని ఇటీవలే నేను కొత్తగా ఓపెన్‌ చేసిన జావెద్‌ హబీబ్‌ హెయిర్‌ అండ్‌ బ్యూటీ సెలూన్‌ కూడా బాగా నడవాలని, నా భార్య, నా కూతురు, నా ఇంట్లో వాళ్ళందరూ, అలాగే జనాలందరూ హ్యాపీ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

మన అయోధ్య రామ మందిరానికి నా వంతున, నా సబ్‌ స్క్రైబర్ల వంతున లక్ష రూపాయలు విరాళంగా అందించాను. ఈ రోజే డబ్బును శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర డొనేట్‌ చేశాను. మీరు కూడా అయోధ్య రామ మందిరానికి విరాళం పంపించండి. ఎందుకంటే ఇది మనందరి కల. ఇప్పటికే రూ. 3, 200 కోట్ల రూపాయలు వచ్చాయట.. ఇందులో ఒక లక్ష రూపాయలు మీ ఆదిరెడ్డి కూడా ఇచ్చాడు’’ అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో అది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఓ యూట్యూబర్ ఏకంగా లక్ష రూపాయలు ఇవ్వడం చర్చనీయాంశమైంది.

Next Story