‘జబర్దస్త్’ కు కొత్త యాంకర్‌.. సౌమ్య రావు ప్లేస్‌లో బిగ్ బాస్ బ్యూటీ

by Disha Web Desk 7 |
‘జబర్దస్త్’ కు కొత్త యాంకర్‌.. సౌమ్య రావు ప్లేస్‌లో బిగ్ బాస్ బ్యూటీ
X

దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెరపై ప్రసారం అవుతున్న షో లలో జబర్దస్త్ ఒకటి. మొదట అనసూయతో స్టార్ట్ అయిన ఈ షో ప్రజలలో మంచి పాపులారిటీ దక్కించుకోవడంతో.. ఎక్స్‌ట్రా జబర్దస్త్ కూడా ప్రారంభించారు. ఇక అనసూయ తర్వాత రష్మి రావడంతో గ్లామర్‌గా కూడా ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయింది ఈ షో. ఇక తర్వాత జబర్దస్త్ నుంచి చాలామంది వెళ్లి పోవడం.. కొత్త వాళ్లు రావడం జరుగుతూ వచ్చింది. జడ్జిల దగ్గర నుంచి యాంకర్ల వరకు మారుతూ వచ్చారు. ఈ క్రమంలోనే అనసూయ కూడా జబర్దస్త్ నుంచి తప్పుకోవడంతో సౌమ్య రావు ఎంట్రీ ఇచ్చి.. తన అందంతో, వచ్చి రానీ తెలుగుతో ఆడియన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక సౌమ్యరావుకు అందరూ కనెక్ట్ అవుతున్నారు అనుకునే సమయంలో ఇప్పుడు మరో కొత్త యాంకర్‌ను పరిచయం చేశారు.

తాజాగా విడుదలైన ప్రోమోతో కొత్త యాంకర్‌ను పరిచయం చేశారు. ఆమె మరెవరో కాదు.. యూట్యూబర్‌గా మంచి పేరు తెచ్చుకుని తర్వాత బిగ్ బాస్ రియాలటీ షో ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరింత దగ్గరైన సిరి హన్మంత్. ప్రస్తుతం సినిమాల్లో కీలక రోల్స్ చేస్తూ అలరిస్తున్న ఈ అమ్మడు.. ఇప్పుడు జబర్దస్త్‌కు యాంకర్‌గా వచ్చేస్తుంది.



Next Story

Most Viewed