అనారోగ్యంతో బాధపడుతున్న 'బిగ్‌బాస్' బ్యూటీ!

by Disha Web Desk 10 |
అనారోగ్యంతో బాధపడుతున్న బిగ్‌బాస్ బ్యూటీ!
X

దిశ, సినిమా: " ఉయ్యాల జంపాల " మూవీలో హీరోయిన్‌కి ఫ్రెండ్‌గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది పునర్నవి. తర్వాత 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' సినిమాలో హీరో కూతురుగా నటించింది . ఇక 'బిగ్‌ బాస్‌' రియాల్టి షో‌తో తెలుగు వాళ్లకు బాగా పరిచయమైంది. అయితే తాజాగా న్యూఇయర్ సందర్భంగా తన అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పింది పునర్నవి. 'అనారోగ్య సమస్యతో నా కొత్త సంవత్సరం మొదలైంది. అవును నేను అనారోగ్యం బారిన పడ్డాను. ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్నా. ఈ మధ్య కాలంలో సిక్ అవడం ఇదే తొలిసారి. ఇదే చివరిసారి కూడా కావాలని కోరుకుంటున్నా' అని చెప్పింది. దీంతో ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Read more:

బీచ్‌లో లక్ష్మీరాయ్ బోల్డ్ షో.. నడుము అందాలు చూస్తే



Next Story

Most Viewed