ప్రియుడితో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న బిగ్‌బాస్ బ్యూటీ పునర్నవి.. వైరల్‌గా మారిన ఫొటోలు

by Mallepaka Hamsa |

తన ప్రియుడికి ఉంగరం తొడిగి, ఎంతో సంతోషంగా కనిపిస్తున్న పునర్నవిని చూసి అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ప్రియుడితో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న బిగ్‌బాస్ బ్యూటీ పునర్నవి..  వైరల్‌గా మారిన ఫొటోలు
X

దిశ, సినిమా: ఇటీవల వరుసగా సెలబ్రిటీలు వైవాహిక బంధంలోకి అడుగుపెడుతున్న వేళ, ఇప్పుడు బిగ్ బాస్ సీజన్-3 సెన్సేషన్ పునర్నవి భూపాలం (Punarnavi Bhupalam)కూడా ఆ జాబితాలో చేరిపోయింది. గత కొన్నాళ్లుగా సైలెంట్‌గా ఉన్న ఈ భామ, సడన్‌గా తన నిశ్చితార్థం వేడుకకు సంబంధించిన వీడియోలు, ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో వాటిని చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. తన ప్రియుడికి ఉంగరం తొడిగి, ఎంతో సంతోషంగా కనిపిస్తున్న పునర్నవిని చూసి అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పునర్నవి ఎంగేజ్‌మెంట్ ఫోటోలు బయటకు వచ్చిన వెంటనే, ఆమె చేసుకోబోయే వ్యక్తి ఎవరనే దానిపై నెటిజన్లు ఆరా తీయడం మొదలుపెట్టారు. తాజా సమాచారం ప్రకారం, ఆమె కాబోయే భర్త పేరు హేమంత్ వర్మ(Hemant Verma).

ఈEngagementయన అమెరికాలో స్థిరపడిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అని తెలుస్తోంది. అంతేకాకుండా ఆయన అడ్వెంచర్ ట్రావెలర్, ఫొటోగ్రాఫర్ కూడా అని సమాచారం. వీరిద్దరికీ ఒకరికి ఒకరు ఎప్పటి నుంచో పరిచయం ఉండటంతో, పెద్దల అంగీకారంతో ఇప్పుడు ఈ బంధాన్ని పెళ్లి వరకు తీసుకెళ్తున్నారు. కశ్మీర్‌లో ఈ జంటకు సంబంధించిన ప్రపోజల్ పిక్స్ కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు సింగర్ రాహుల్ సిప్లీగంజ్‌తో పునర్నవికి ఉన్న సాన్నిహిత్యం అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. అయితే, హౌస్ నుంచి బయటకు వచ్చాక తాము కేవలం స్నేహితులమేనని వారు క్లారిటీ ఇచ్చారు. ఇటీవల రాహుల్ సిప్లీగంజ్ వివాహం చేసుకోగా, ఇప్పుడు పునర్నవి కూడా మార్చి 20న పెళ్లి పీటలెక్కబోతున్నట్లు సమాచారం. ఎంగేజ్‌మెంట్ వేడుకతో ఒక ఇంటిది కాబోతున్న పునర్నవికి నెటిజన్లు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు

Next Story